వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ తౌహీద్ హృదయ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బోగ్రా, బంగ్లాదేశ్ | 2000 డిసెంబరు 4|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి offbreak | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 140) | 2023 మార్చి 18 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 78) | 2023 మార్చి 9 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 14 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18 | Rajshahi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18 | Shinepukur | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | సిల్హెట్ సిక్సర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Fortune Barishal | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Sylhet Strikers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Jaffna Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 జూన్ 16 |
తౌహిద్ హృదయ్ (జననం 2000 డిసెంబరు 4) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2017 అక్టోబరు 13న 2017–18 నేషనల్ క్రికెట్ లీగ్‌లో రాజ్‌షాహీ డివిజన్ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు [2]
2017 డిసెంబరులో తైహిద్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] అతను 2018 ఫిబ్రవరి 5న 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో షినేపుకుర్ క్రికెట్ క్లబ్ తరపున తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు.[4]
2018 అక్టోబరులో 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం అతన్ని, సిల్హెట్ సిక్సర్స్ జట్టులోకి తీసుకున్నారు.[5] అతను 2019 జనవరి 6న 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [6] 2019 డిసెంబరులో, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [7] 2021 ఫిబ్రవరిలో, ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఎమర్జింగ్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [8] [9]
2021 డిసెంబరులో, 2021-22 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ సందర్భంగా తౌహీద్, 217 పరుగులు చేసి, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. [10]
2023 మార్చిలో, తైహీద్ 85 బంతుల్లో 92 పరుగులు చేసాడు. అది బంగ్లాదేశ్ బ్యాటర్లకు వన్డే రంగప్రవేశంలో అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్. [11]
2023 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు. [12] 2023 మార్చిలో, అతను అదే సిరీస్ కోసం ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [13] 2023 మార్చి 9న, ఆ సిరీస్‌లోని మొదటి T20I అతని కెరీర్లో తొలి T20I. [14] 2023 మార్చి 18న ఐర్లాండ్‌పై వన్‌డేల్లో ఆడుగుపెట్టాడు.[15] అందులో తౌహీద్ 92 పరుగులు చేశాడు. ఇది అతని వన్డే రంగప్రవేశంలో బంగ్లాదేశ్ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు. [16]
ఇంకా, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో, తైహీద్ మొదటి T20లో 47 పరుగులతో మ్యాచ్‌న్ను గెలిపించే ఇన్నింగ్సు ఆడాడు. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి బంగ్లాదేశ్ గెలిచింది.