త్రిచూర్ వైద్యనాథ రామచంద్రన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | వి.రామచంద్రన్ |
జననం | త్రిచూర్, కొచ్చిన్ రాష్ట్రం, బ్రిటీషు ఇండియా | 1940 ఆగస్టు 9
సంగీత శైలి | కర్ణాటక సంగీతం (గాత్రం) |
వృత్తి | గాయకుడు |
క్రియాశీల కాలం | 1954 - ప్రస్తుతం వరకూ |
జీవిత భాగస్వామి | చారుమతి రామచంద్రన్ |
త్రిచూర్ వి.రామచంద్రన్(జననం 1940) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.[1] ఇతనికి 2003లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది.[2]
ఇతడు కొచ్చిన్ రాజ్యానికి( ప్రస్తుతం కేరళ రాష్ట్రం) చెందిన త్రిచూర్ పట్టణంలో 1940, ఆగస్టు 9న జన్మించాడు. ఇతడు జి.ఎన్.బాలసుబ్రమణియం వద్ద సంగీతం నేర్చుకున్నాడు.[3] ఇతడు తన 14వయేటనే తొలి సంగీత కచేరీ ఇచ్చాడు.[4][5] తరువాత భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక ఉపకార వేతనం పొంది ఎం.ఎల్.వసంతకుమారి వద్ద శిక్షణ తీసుకున్నాడు.[6]ఇతడు పది సంవత్సరాలపాటు కృష్ణానంద్ వద్ద కిరాణా ఘరానా పద్దతిలో హిందుస్తానీ సంగీతం కూడా అభ్యసించాడు.[7] ఇతడు 1973లో చారుమతిని వివాహం చేసుకున్నాడు. ఈవిడ కూడా సంగీత విద్వాంసురాలే.
1992-93 సంవత్సరానికి "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది.[7] ఇతడు 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందాడు.[8] అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఇతడిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2001లో శ్రీకృష్ణ గాన సభ "సంగీత చూడామణి" బిరుదుతో సత్కరించింది. 2009లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ "విద్యా తపస్వి" బిరుదును ప్రదానం చేసింది.[6]2012లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.[9][10] వీటితో పాటుగా ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు ఇతడికి లభించాయి.
{{cite book}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)