త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయిక (త్రి అనగా మూడు, వేణి అనగా నది). ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడి.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం. ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది, యమునా నది ఆకుపచ్చ రంగులో, సరస్వతి నది అంతర్వాహిని గా ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు.[1] [2]
ఇది మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి నదులు కలుస్తాయి.
పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని త్రిబేని పట్టణంలో, గంగా నది, భాగీరథి, హుగ్లీ కలుస్తాయి. వీటిని గంగా, జమున, సరస్వతి అని పిలుస్తారు.
గుజరాత్ లోని త్రివేణి సంగమం, గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సోమనాథ్, వెరావల్ సమీపంలో ఉంది. ఇక్కడ హిరాన్, కపిల, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ మూడు నదులు కలిసి పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో కలుస్తాయి.[3]
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.[4]
ఇది కూడుతురైలోని ఈరోడ్ ఉంది. ఇక్కడ కావేరీ, భవానీ, అముదా నదులు కలుస్తాయి.[5] దీనిని దక్షిణ త్రివేణి సంగమం అని అంటారు.
భాగమండల కర్నాటక లోని కొడగు జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ కావేరీ, కన్నికే, సుజ్యోతి అనే నదులు కలుస్తాయి.
తిరుమకూడలు నరసిపుర లేదా టి. నరసిపుర కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ కావేరీ, కబిని, స్పటిక సరోవర నదులు కలుస్తాయి. ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు.
ఇక్కడ కాళియార్, తోడుపుజయార్, కొతయార్ అనే మూడు నదులు కలుస్తాయి.
మున్నార్ అనగా మూడు నదులు అని అర్ధం. ముధిరపూజ, నల్లతన్ని, కుండల నదులు కలిసిపోయే ప్రదేశం.
ఇది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా , రెంజల్ మండలంలోని గ్రామం. ఇక్కడ గోదావరి నది, మంజీర, హరిద్రా నదులు కలుస్తాయి.
ఇది భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ బనాస్ నది బెరాచ్, మెనాలి నదులతో కలిసిపోతుంది[6].