థాకూర్ అనూప్ సింగ్

ఠాకూర్ అనూప్ సింగ్
జననం (1989-03-23) 1989 మార్చి 23 (వయసు 35)
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటుడు
  • బాడీ బిల్డర్
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

థాకూర్ అనూప్ సింగ్ భారతదేశానికి చెందిన బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, సినిమా నటుడు. ఆయన 2015లో బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ మీట్ లో స్వర్ణ పతాకం సాధించాడు.[1]

సినీ జీవితం

[మార్చు]

థాకూర్ అనూప్ సింగ్ 2008లో భారత ఎయిర్ లైన్స్ పైలట్ గా లైసెన్స్ తీసుకుని ఆ తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి 2011లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన మహాభారత్ సీరియల్ లో ధృతరాష్ట్రునిగా నటించి మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన 2017లో యముడు 3 సినిమా[2] ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, హింది సినిమాల్లో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు
2017 సింగం 3 విఠల్ ప్రసాద్ తమిళ్ \ తెలుగు తెలుగులో యముడు 3
విన్నర్ ఆది తెలుగు
కమెండో 2 కేపీ హిందీ
రోగ్ సైకో తెలుగు
కన్నడ
2018 ఆచారి అమెరికా యాత్ర విజయ్ (విక్కీ) తెలుగు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చల్లా కుమారుడు తెలుగు
2019 యజమాన దేవి శెట్టి కన్నడ
ఉద్ఘార్ష ఆదిత్య
2022 ఖిలాడి డేవిడ్ తెలుగు
బెభాన్ ఉదయ్ పత్వార్ధన్ మరాఠీ [3]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష
2011 ద్వారకాధీష్ - భగవాన్ శ్రీ కృష్ణుడు యువరాజు దుశ్శాసనుడు హిందీ
2011 కహానీ చంద్రకాంత కీ ప్రత్యేక ప్రదర్శన హిందీ
2011 చంద్రగుప్త మౌర్య యువరాజు మలకేతు హిందీ
2011 జై బజరంగబలి యువరాజు హిందీ
2011 రామాయణం హనుమంతుడు హిందీ
2013-2014 మహాభారతం ధృతరాష్ట్రుడు హిందీ
2014 అక్బర్ బీర్బల్ ముల్లా దోపియాజా హిందీ
2014 సీఐడీ అతిథి పాత్ర హిందీ

బాడీబిల్డింగ్ కెరీర్

[మార్చు]
సంవత్సరం గెలుస్తుంది ఈవెంట్ వర్గం
2015 బంగారం 7వ WBPF ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ - థాయిలాండ్ పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్
2015 కంచు 49వ ఆసియా ఛాంపియన్‌షిప్ - ఉజ్బెకిస్థాన్ పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్
2015 వెండి ఫిట్ ఫ్యాక్టర్ - మిస్టర్ ఇండియా 2015 పురుషుల ఫిట్‌నెస్ ఫిజిక్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (1 December 2015). "టీవీ ధృతరాష్ట్రుడు.. స్వర్ణ పతక విజేత!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. Sakshi (28 August 2016). "సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  3. "ThakurAnoop Singh and Mrunmayee Deshpande Will be Seen in Bebhan Movie". www.loksatta.com. 23 December 2016. Archived from the original on 26 December 2016. Retrieved 5 October 2019.

బయటి లింకులు

[మార్చు]