రెసిడెన్సీ (ఆంగ్లం: The Residency, Lucknow) అనేది ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఒకే ఆవరణలో ఉన్న భవనాల సుముదాయం. నవాబు ఆస్థానంలో బ్రిటీషు ప్రతినిధికి వసతి గృహంగా వినియోగించటానికి ఇది కట్టబడింది.
నవాబ్ సాదత్ ఆలీ ఖాన్ హయాంలో 1780 నుండి 1800 వరకు దీని నిరాణం జరిగింది. స్వాతంత్ర్య సమరంలో భాగంగా 1 జూలై 1857 నుండి 1857 నవంబరు 17 వరకు జరిగిన లక్నో దాడిలో ఈ భవన సముదాయానికి రక్తపు మరకలు అంటాయి. కల్నల్ పామర్ కుమార్తె సుసాన్నా పామర్ ఫిరంగి గుండు తాకి, హెన్రీ మాంట్గోమరీ లారెన్స్ గ్రంథాలయంలో కూర్చొని ఉండగా తుపాకీ గుండు తాకి మరణించారు. ప్రస్తుతం రెసిడెన్సీ శిథిలావస్థలో ఉంది.