ఎం.ఎం.దండపాణి దేశికర్ | |
---|---|
జననం | మద్రాసు ప్రెసిడెన్సీ, తిరుచెంగట్టన్‌గుడి | 1908 ఆగస్టు 27
మరణం | 1972 జూన్ 26 | (వయసు 63)
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసుడు, సినిమా నటుడు |
ఎం.ఎం.దండపాణి దేశికర్ (ఆగష్టు 27, 1908 – జూన్ 26, 1972) ఒక కర్ణాటక సంగీత గాత్రవిద్యాంసుడు, స్వరకర్త.
దండపాణి దేశికర్ మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచెంగట్టన్‌గుడి గ్రామంలో 1908, ఆగష్టు 27న జన్మించాడు. ఇతడు తన సంగీతాన్ని, తేవరం స్తోత్రాలను తన తండ్రి ముత్తయ్య దేశికర్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత ఇతడు మాణిక్య దేశికర్, సత్తయ్యప్ప నయనాకరర్, కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై వద్ద సంగీతంలో సంపూర్ణ శిక్షణను పొందాడు. ఇతడు తన మొదటి ప్రదర్శనను తిరుమరుగళ్‌లో ఇచ్చాడు. అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో ఇతడు 15 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
ఇతడికి "ఇసై అరసు", "పందిసై పులవర్ కోనె", "తేవర మణి", "సంగీత సాహిత్య శిరోమణి","సంగీత కళా శిఖామణి" "తిరుమురై కళానిధి", "తందక వెందు", "పన్నిసై వెంధం", "ఇసై పులవర్", "కళైమామణి", "ఇసై పేరిరజ్ఱర్" మొదలైన బిరుదులు ఉన్నాయి.
ఇతడు 1935 నాటి సంసార నౌక అనే కన్నడ సినిమాలో ఒక తమిళ పాటను పాడాడు. ఇతడు ఆరు తమిళ సినిమాలలో ముఖ్య పాత్రలను ధరించాడు.
సినిమా | విడుదలైన సంవత్సరం | పాత్ర | దర్శకుడు | నిర్మాత | వివరాలు |
---|---|---|---|---|---|
పట్టినాథర్ | 1936 | పట్టినాథర్ | ఇది పట్టినాథర్ అనే సన్యాసి జీవిత కథ. | ||
వల్లాల మహారాజ | 1938 | వల్లాల మహారాజు | |||
తాయుమనవర్ | 1938 | తాయుమనవర్ | టి.ఆర్.సుందరం | టి.ఆర్.సుందరం | తాయుమనవర్ జీవిత కథ |
మాణిక్య వాచకర్ | 1939 | మాణిక్య వాచకర్ | టి.ఆర్.సుందరం | వి.ఎస్.ఎం.గోపాలకృష్ణ అయ్యర్ | మాణిక్య వాచకర్ జీవిత కథ |
నందనార్ | 1942 | నందనార్ | మురుగదాస | ఎస్.ఎస్.వాసన్ | ఇది హరిజన భక్తుడు నందనార్ కథ. |
తిరుమలిసై ఆళ్వార్ | 1948 |