పుణే లోని దక్కన్ కళాశాల 1821 లో స్థాపించబడిన పురాతత్వ శాస్త్రం, భాషా శాస్త్రాల పరీశోధనా సంస్థ. ఇది మొట్టమొదటిగా హిందూ కాలేజ్ అనే పేరుతో స్థాపించబడింది. భారత దేశంలో ఆధునిక విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టిన తొలి కళాశాలల్లో ఇది కూడా ఒకటి. బాంబే ప్రెసిడెన్సీ లెఫ్టినెంట్ గవర్నరైన మౌంట్ స్టువార్ట్ ఎల్ఫిన్ స్టోన్ దీనిని ప్రారంభించాడు. దీనికి సర్దార్ ఖండేరావ్ దభాడే పేష్వా నిధులు సమకూర్చాడు.[1] దీన్నే పూనా సంస్కృత కళాశాల అని కూడా పిలిచేవారు. దీని మొట్టమొదటి ప్రింసిపల్ థామస్ క్యాండీ.[2]
1837 లో ఇంగ్లీషు, ఇతర ఆధునిక సబ్జెక్టులను పాఠ్య ప్రణాళికలో చేర్చారు.[3] 1842 లో ఒక ఇంగ్లీషు కళాశాలను స్థాపించి దానిని జూన్ 7, 1851 లో హిందూ కళాశాలలో కలిపివేసి పూనా కాలేజీ అని వ్యవహరించారు. 1857 లో సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తే 1860 లో W.A. రస్సెల్ ప్రిన్సిపల్ అయ్యాడు.[4]
మొదటగా ఈ కళాశాల విశ్రాంబాగ్ వాడాలో ఉండేది. తరువాత దీన్ని వానోరీకి, తరువాత ప్రస్తుతం ఉన్న విశాలమైన ప్రాంగణమైన యెరవాడ లోకి తరలించారు. బాంబే ప్రభుత్వం దీనికి భూమిని సమకూర్చింది. 1864, అక్టోబరు 14 న ప్రధావ భవనానికి శంకుస్థాపన చేశారు. విక్టోరియన్ నియో గోతిక్ శైలిలో నిర్మాణం చేశారు. సర్ జంషెడ్జీ జీజీబాయి ఇచ్చిన లక్ష రూపాయల విరాళంతో సర్ హెంరీ బార్టిల్ ఫ్రెరే కిర్కీ, ఎరవాడ ల మధ్య నిర్మింప జేశాడు.
కళాశాల నూతన భవనాలు మార్చి 23, 1868 నుంచి ప్రారంభమయ్యాయి. అప్పుడే దీనిని దక్కన్ కాలేజీ అని పేరు మార్చారు. ఎందుకంటే అప్పుడు దక్షిణ ప్రాంతమంతటి నుంచీ విద్యార్థలను తీసుకునే వారు. 1881 వరకూ కళాశాలలో నలుగురు ఆచార్యులు, ఒక ప్రింసిపల్ ఉండేవారు.
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)