దమ్దామా సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల గురుగ్రామ్ జిల్లాలో కలదు. ఇది 1947 లో బ్రిటిష్ వారు వర్షపు నీటి సేకరణ కోసం నిర్మించిన ఆనకట్ట ద్వారా ఏర్పడింది.[1][2]
ఆరావళి కొండల దిగువ ప్రాంతంలో ఈ సరస్సు నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సు నీటి మట్టం 20 అడుగుల (6.1 మీ) వరకు ఉంటుంది. వర్షాకాలంలో నీటి మట్టం 50 అడుగులు (15 మీ) - 70 అడుగుల (21 మీ) వరకు పెరుగుతుంది.[3][4]
అక్టోబర్ నుండి మార్చి వరకు, వేసవికాలం, వర్షాకాలంలలో ఈ సరస్సును సందర్శించడానికి అనువైన సమయం. వేసవిలో వాతావరణం సాధారణ వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 45–47°C వరకు ఉంటుంది.[5][6]
దమ్దామా సరస్సు పక్షులకు సహజమైన నివాసం, 190 జాతులకు పైగా వలస, స్థానిక పక్షులు వేసవి, వర్షాకాలం, శీతాకాలంలలో దీనిని సందర్శిస్తాయి. అనగా ఏడాది పొడవునా వివిధ ప్రదేశాల నుండి వివిధ రకాల పక్షులు వస్తాయి. నీటి కోడి, క్రేన్లు, కార్మోరెంట్స్, టెర్న్లు, ఎగ్రెట్స్, కింగ్‌ఫిషర్లు మొదలైనవి ఇక్కడ కనిపించే కొన్ని ప్రధాన పక్షులు.[7]