దర్శనం మొగులయ్య | |
---|---|
![]() 2016 ఏప్రిల్ 8న రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకలలో 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రదర్శన | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1951 అవుసాలికుంట గ్రామం, లింగాల మండలం , నాగర్‌కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
జీవిత భాగస్వామి | శంకరమ్మ |
సంతానం | కూతురు (రాములమ్మ) కుమారుడు (మహేందర్) |
తల్లిదండ్రులు | ఎల్లయ్య (తండ్రి) |
దర్శనం మొగులయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నాడు.[1] భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[2][3][4]
తెలంగాణ ప్రభుత్వం నుండి 2022 జూన్ 2న కోటి రూపాయల నగదు ప్రోత్సాహం, 2023 ఫిబ్రవరి 16న హైదరాబాదులోని బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివాస స్థలాలాన్ని బహుమతిగా అందుకున్నాడు.[5]
దర్శనం మొగులయ్య నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం, అవుసలికుంట గ్రామంలో జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు, ఆయనకు కూతురు రాములమ్మ, కుమారుడు మహేందర్ ఉన్నారు. మొగులయ్య భార్య శంకరమ్మ అనారోగ్యంతో మంచాన పడితే ఆసుపత్రిలో వైద్యం చేయించే స్థోమత లేక పరిస్థితి విషమించి ఆమె మరణించింది.[6] 'కిన్నెర కన్నీరు' పేరుతో వచ్చిన ఓ కథనాన్ని ఓ పత్రికలో చూసి చలించిపోయిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి మొగులయ్యకు రూ. 25 వేల ఆర్థికసాయం అందజేశాడు.[7][8]
దర్శనం మొగులయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ పండుగల సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, వనపర్తి రాజుల కథలు వంటి తెలంగాణ వారి వీరగాథలు తన వాద్యంతో వినసొంపైన హావభావ సహితంగా వినిపిస్తాడు.[9] వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఈ కిన్నెర వాద్యాన్ని తయారు చేస్తాడు. దర్శనం మొగులయ్య ఈ కళను చూసిన తెలుగు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగ 12 మెట్ల కిన్నెర కళ గురించి పేపర్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి, అనేక చోట ప్రదర్శనలు ఇప్పించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఈ ప్రదర్శనను చూసిన సినీ ప్రముఖులు అజిత్ నాగ్, అవసరాల శ్రీనివాస్, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ ఆయనను అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దర్శనం మొగులయ్యకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రదర్శలను ఇస్తున్నాడు. ఆయనకు ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేలు పింఛను అందజేస్తోంది.[10][11] తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దర్శనం మొగులయ్య కిన్నెర కళాకారుని ప్రతిభను గుర్తించి, ఆ కళారూపాన్ని డాక్యూమెంటరీ చేశారు.
పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా 2022, జనవరి 28న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొగులయ్యను శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు హైదరాబాదు నగరంలో 600 గజాల ఇంటిస్థలం, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కోటి రూపాయల సాయం ప్రకటించాడు.[12][13]
2022 జూన్ 2న హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా పోచంపల్లి పట్టు శాలువాతో సత్కరించబడి, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం అందుకున్నాడు.[14][15] 2023 ఫిబ్రవరి 16న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాదులోని బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 600 గజాల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను అందుకున్నాడు.[5]
మొగులయ్య తొలిసారిగా 2021లో భీమ్లా నాయక్ సినిమాలో ‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అనే పాట ద్వారా సినీరంగంలోకి వచ్చి, ఆ పాటకు మంచి గుర్తింపు అందుకున్నాడు.[16][17][18]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)