దళం | |
---|---|
దర్శకత్వం | బి. జీవన్ రెడ్డి |
రచన | శంకర్ దేవరాజ్ |
స్క్రీన్ ప్లే | బి. జీవన్ |
కథ | బి. జీవన్ |
నిర్మాత | ఎం. సుమంత్ కుమార్ రెడ్డి |
తారాగణం | నవీన్ చంద్ర పియా బాజ్‌పాయ్ నాజర్ కిషోర్ అభిమన్యు సింగ్ |
కూర్పు | మధు |
సంగీతం | జేమ్స్ వసంతన్ |
నిర్మాణ సంస్థలు | ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దళం 2013, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, పియా బాజ్‌పాయ్, నాజర్, అభిమన్యు సింగ్, కిషోర్ నటించగా జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం. సుమంత్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2014, ఏప్రిల్ 4న కూట్టం పేరుతో తమిళంలో విడుదలైంది. జైలు నుండి విడుదలైవచ్చిన మాజీ నక్సలైట్ల బృందం కొత్తగా తమ జీవితాలను ప్రారంభించి పోలీసులు, రాజకీయ నాయకులపై వారు చేసిన పోరాట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.[1]
నక్సలైట్లు ఉన్న ప్రాంతంలో చిత్రకథ ప్రారంభమవుతుంది. అక్కడ రాష్ట్ర పోలీసు, నక్సలైట్లకు మధ్య కాల్పుల పోరాటం జరుగుతోంది. ఆ పోరాటంలో చాలామంది నక్సలైట్లు చనిపోతారు. నక్సలైట్లు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ప్రభుత్వానికి లొంగిపోతారు. జైలులో ఉన్న సమయంలో వారు చాలా హింసకు గురవుతారు. అప్పుడు జైలు అధికారి వారిని మార్చి పోలీసు సానుభూతిపరులుగా మారడానికి, ఉద్యోగాలు రావడానికి సహాయం అందిస్తాడు.
2012 ప్రారంభంలో పియా వాజ్‌పాయ్‌తో ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమయింది. అప్పటికే నవీన్ చంద్రతో తమిళంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటులు కిషోర్, నాజర్, సాయికుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ప్రతి సన్నివేశాన్ని తమిళ, తెలుగు భాషల కోసం రెండుసార్లు చిత్రీకరించారు.[2]
Untitled | |
---|---|
ఈ చిత్రానికి జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎటెల్లినా అరణ్యమే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విజయ్ యేసుదాస్ | 3:09 |
2. | "తయ్యా తయ్యా (రచన: కృష్ణ చైతన్య)" | కృష్ణ చైతన్య | ధనుంజయ్, బెల్లీ రాజ్, రఘు, సోమసుందర్, ప్రసాద్ | 4:44 |
3. | "ఇక్కడి నుండి ఎక్కడి దాకా (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | హరిచరణ్, శ్వేత మోహన్ | 5:26 |
4. | "అద్దిరబన్నా (రచన: సాహితి)" | సాహితి | ప్రియ సుబ్రహ్మణ్యం | 4:48 |
5. | "ఎక్ బార్ ఏసుకోరా తీన్ మార్ (రచన: కృష్ణ చైతన్య)" | కృష్ణ చైతన్య | ధనుంజయ్, సుందరన్, శ్రీనివాస్, పూజా | 4:24 |
మొత్తం నిడివి: | 22:31 |
2013, ఆగస్టు 15లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు అందుకుంది. "సామాజిక అంశాల నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం మనలోని ఆలోచనలను కలిగిస్తుందని" పేర్కొనబడింది.[3]
{{cite web}}
: CS1 maint: url-status (link)