దళవాయి చలపతి రావు అనంతపూర్ జిల్లాకు చెందిన తోలు తోలుబొమ్మలాట కళాకారుడు. తోలుబొమ్మలాట కళలో చేసిన కృషికి 2020 లో అతనికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం [1] లభించింది.
అతను ధర్మవరం మండలంలోని నిమ్మలకుంత గ్రామంలో నివసిస్తున్నాడు.[2] అతను తన పదేళ్ల వయసులో తోలుబొమ్మలాట ప్రారంభించాడు. ఆరు దశాబ్దాలుగా తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మల ప్రదర్శనలో ఆయన నిమగ్నమయ్యాడు. 1988 లో అతను తన కళకు జాతీయ పురస్కారాన్ని [3] [4] అందుకున్నాడు. అతను 2016 లో కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. తొలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో యువతకు ఆయన శిక్షణనిస్తున్నాడు.