దాగుడుమూత దండాకోర్

దాగుడుమూత దండాకోర్
దాగుడుమూత దండాకోర్ సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్.కె. మలినేని
రచనపెద్దింటి అశోక్ కుమార్ (మాటలు)
స్క్రీన్ ప్లేఆర్.కె. మలినేని
కథఏ.ఎల్. విజయ్
దీనిపై ఆధారితంశివం (2014)
నిర్మాతరామోజీరావు
క్రిష్ (సమర్పణ)[2]
తారాగణంరాజేంద్రప్రసాద్
సారా అర్జున్
రవిప్రకాష్
రవివర్మ
సత్యం రాజేష్
నిత్యాశెట్టి
ఛాయాగ్రహణంవి.ఎస్.జ్ఞానశేఖర్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంఇ.ఎస్. మూర్తి[3]
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్[4]
విడుదల తేదీ
9 మే 2015 (2015-05-09)[1]
సినిమా నిడివి
109 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దాగుడుమూత దండాకోర్ 2015, మే 9న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ & ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో దర్శకుడు క్రిష్ సమర్పణలో ఆర్.కె. మలినేని దర్శకత్వం వహించాడు.[5] రాజేంద్రప్రసాద్, సారా అర్జున్, రవిప్రకాష్, రవివర్మ, సత్యం రాజేష్, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా ఇ.ఎస్. మూర్తి సంగీతం అందించాడు. 2014లో తమిళంలో వచ్చిన శైవం సినిమాకి రీమేక్ సినిమా ఇది. దర్శకుడిగా ఆర్.కె. మలినేనికి ఇది తొలిచిత్రం కాగా, సారా అర్జున్ తెలుగు చిత్రంలో కూడా తన పాత్రనే పోషించింది.[6][7] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

కథా నేపథ్యం

[మార్చు]

రాజులపాలెంలోని రాజుగారు (రాజేంద్ర ప్రసాద్) తన ముగ్గురు కొడుకుల్లో ఒకడితో వ్యవసాయం చేయించుకొంటూ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటాడు. తన గారాల మనవరాలు బంగారం (సారా అర్జున్) అంటే రాజుగారికి అమితమైన ప్రేమ. బంగారం ఇంట్లోని లేగదూడలు, కోళ్ళతో అనుబంధాన్ని పెంచుకుంటుంది. నాని అనే కోడిపుంజు అంటే ఎంతో ఇష్టం. చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుండి రాజుగారి పెద్దకొడుకు, చెన్నై నుండి ఉండే చిన్న కొడుకు, దుబాయ్ నుండి కూతురు వస్తారు. చాలా రోజుల తరువాత తండ్రి దగ్గరకు వచ్చినా వారు ప్రశాంతంగా ఉండలేరు. తమతమ వ్యక్తిగత సమస్యలతో, ఊర్లో తలెత్తే సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దీనికంతటికీ కారణం అమ్మవారికి మొక్కు చెల్లించకపోవడమే అని నిర్ణయించుకుంటారు. అమ్మ వారికి కోడిపుంజును బలి ఇస్తామని మొక్కుకొని, బంగారానికి ఇష్టమైన కోడిపుంజు నానిని బలి ఇవ్వాలని అనుకొంటారు. ఇంతలోనే నాని కనిపించకుండా పోతుంది. అది ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభిస్తారు. మరి వరండాలో ఉండాల్సిన కోడిపుంజు ఏమయ్యింది, అది ఎక్కడ ఉందో కనుక్కొన్నారా, అమ్మవారికి మొక్కు తీర్చుకోగలిగారా అన్నది మిగత కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఇ.ఎస్. మూర్తి ఈ చిత్రానికి సంగీతం అందించడంతోపాటు పాటలు కూడా రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదల చేయబడ్డాయి. 2015, జనవరి 30న హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో రామోజీరావు, తమిళ సినిమా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ పాల్గొన్నారు.[8]

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఎవరు నేర్పారు"మధు బాలకృష్ణన్, ఉత్తర ఉన్నికృష్ణన్3:34
2."మనిషి మనిషిని"నరేన్ అల్లం, గాయత్రి, జయశ్రీ, ప్రియా హిమేష్4:21
3."నా ఇల్లు నా వాళ్ళు"ఇ.ఎస్. మూర్తి, ఉత్తర ఉన్నికృష్ణన్4:09
4."కోక్కో కోక్కో"సిరివెన్నెల సీతారామశాస్త్రి, బాలాజీ, సాయి చరణ్, యోగీశ్వర్ శర్మ, అశ్విని, సింధూరి, సిసిర3:23
5."దాగుడుమూతల జాతర"మ్యూజిక్ బిట్3:01
మొత్తం నిడివి:18:30

మూలాలు

[మార్చు]
  1. "Review : Dagudumutha Dandakor – Traditional Family Drama". 123telugu.com. Retrieved 30 October 2020.
  2. "Ramoji Rao to challenge Young Tiger". aptoday.com. 4 February 2015. Archived from the original on 4 February 2015. Retrieved 30 October 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Dagudumootha Dandakor's audio launched". timesofindia.indiatimes.com. 30 Jan 2015. Retrieved 30 October 2020.
  4. "Dil Raju to release Daagudu Mootha Dandakor in AP and Telangana". indiaglitz.com. 18 April 2015. Retrieved 30 October 2020.
  5. "Continuous films in Usha Kiran Movies". aroundandhra.com. Archived from the original on 12 ఫిబ్రవరి 2015. Retrieved 30 October 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Rajendra Prasad's look in Dagudumoota Dandakore". indiatimes.com. 25 January 2015. Retrieved 30 October 2020.
  7. "Review: Dagudumootha Dandakor". andhraheadlines.com. Archived from the original on 9 May 2015. Retrieved 30 October 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Daagudu Moothala Dandacore Audio Launch Details". businessoftollywood.com. 31 January 2015. Archived from the original on 18 February 2015. Retrieved 30 October 2020.

ఇతర లంకెలు

[మార్చు]