శంకర్ త్రయంబక్ ధర్మాధికారి (1899 జూన్ 18 - 1985 డిసెంబరు 1) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయ ఆలోచనాపరుడు, ప్రముఖ రచయిత. [1] ఆయన 'దాదా ధర్మాధికారి' గా ప్రసిద్ధి చెందారు.
దాదా ధర్మాధికారి 1899 లో మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జన్మించాడు. నాగ్‌పూర్‌లో విద్య అభ్యసించాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1920 లో దాదా ధర్మాధికారి పాఠశాలను విడిచిపెట్టాడు. అతను ఎలాంటి అధికారిక విద్య పట్టా తీసుకోలేదు. స్వీయ అధ్యయనం తోనే అతను తన కాలపు ఆలోచనాపరులలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందాడు. అతను హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు [2]
దాదా ధర్మాధికారి నాగ్‌పూర్ తిలక్ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని ప్రారంభించాడు. అతను స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. 1935 లో, అతను వార్ధా వెళ్ళి స్థిరపడ్డాడు. అతను 'గాంధీ సేవా సంఘం' లో చురుకైన కార్యకర్త. [3] [4]