దామోదర్ గణేష్ బాపట్ (1935 లేదా 1936 - ఆగస్టు 17, 2019) ఈయన భారతీయ సామాజిక కార్యకర్త. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.
ఈయన 1935 లేదా 1936 లో మహారాష్ట్ర రాష్ట్రలోని అమరావతి జిల్లాలోని పాత్రోట్ గ్రామంలో జన్మించాడు. ఈయన నాగ్ పూర్ నగరంలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీలను పూర్తి చేశాడు.[1]
ఈయన 1970 లో ఛత్తీస్ ఘడ్లోని జాష్‌పూర్ అనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాన్వాసి కళ్యాణ్ ఆశ్రమంతో స్వయంసేవకంగా పనిచేయడం ప్రారంభించాడు.[2] ప్రారంభంలో గిరిజన పిల్లలకు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అక్కడ ఉన్న కుష్టు రోగులను కూడా కలుసుకునేవాడు. కుష్టు రోగుల సంరక్షణ కోసం చంపా నుండి 8 కిలోమీటర్ల (5 మైళ్ళు) దూరంలో ఉన్న సోతి గ్రామంలో భారతీయ కుష్తా నివారక్ సంఘ్ (బికెఎన్ఎస్) అనే ఆశ్రమ స్థాపకుడు సదాశివ్ కత్రేతో పరిచయం ఏర్పడింది. కుష్ఠురోగ రోగులతో పాటు వారి సామాజిక, ఆర్థిక పునరావాసాలను చూసుకోవడానికి సదాశివ్ కత్రేతో కలిసి పనిచేశాడు. ఇలా చేస్తున్న క్రమంలో 1975 లో భారతీయ కుష్తా నివారక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడ్డాడు. 1972 నుండి 2019 లో తను మరణించే వరకు కుష్టు రోగులకు సేవలు చేస్తూనే ఉన్నాడు.[3]
ఈయన చేసిన సామాజిక కృషికి గాను భారత ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఈయనకు రాజ్య అలంకర్‌ను ప్రదానం చేసింది. కోల్‌కతా లోని శ్రీ బదాబజార్ కుమార్ సభ పుస్తకాలయ ఈయనకు వివేకానంద సేవా పురస్కర్‌ను ప్రదానం చేసింది. భరవు డియోరాస్ ఫౌండేషన్ ఈయనకు భరవు డియోరస్ సేవా స్మృతి పురస్కర్ ను ప్రదానం చేసింది. కుష్ఠు వ్యాధి రోగుల పునరావాసం, విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో, వారిని స్వావలంబన చేసినందుకు గాను సెప్టెంబర్ 12, 2006 న ఇండోర్ లోని శ్రీ అహిల్యోత్సవ్ సమితి పదవ దేవి అహిల్యబాయి జాతీయ అవార్డును ప్రకటించింది.
ఈయన ఆగస్టు17, 2019 న తెల్లవారుజామున 2:35 గంటలకు ఛత్తీస్ ఘడ్ ఆసుపత్రిలో మరణించాడు. ఈయన తన శరీరాన్ని పరిశోధనా ప్రయోజనాల కోసం బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు విరాళంగా ఇచ్చాడు.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)