దాల్చా | |
---|---|
ప్రత్యామ్నాయ పేర్లు | దాల్ మై దూబా హువా మటన్ |
Course | మెయిన్ కోర్స్ |
మూల స్థానం | భారతదేశం |
ప్రాంతం లేదా రాష్ట్రం | తెలంగాణ |
సృష్టి కర్త | షాజహాన్ |
Serving temperature | అన్నంతో |
మూల పదార్థాలు | మటన్, శనగపప్పు, చింతపండు |
Variations | సాంబారు |
Cookbook:దాల్చా దాల్చా |
దాల్చా అనేది పప్పు ఆధారిత హైదరాబాదీ వంటకం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దీనిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇందులో ప్రాథమిక పదార్థాలు కాయధాన్యాలు కాగా, శనగపప్పు లేదా కందిపప్పు కావచ్చు. దీనిని మాంసాహారంతో కలిపి కూడా వండవచ్చు. మటన్ కలిపితే దానిని మటన్ దాల్చా అంటారు. దాల్చాలో సొరకాయ మరొక ముఖ్య కూరగాయ. దీనిని అన్నం లేదా రోటీతో తినవచ్చు, అవేవి లేకుండా కూడా తినవచ్చు.[1]
హైదరాబాద్‌లో నిజాం కాలం నుంచి వస్తున్న అత్యంత సాధారణ వంటకం ఇది. భారతీయ సంస్కృతికి చెందిన వంటకం అయినప్పటికీ దీనిని మలేషియా, సింగపూర్‌లలో జరిగే చాలా మలేయ్ వివాహాలలో తప్పనిసరిగా వడ్డిస్తారు.[2][3]