The Park Chennai | |
---|---|
హోటల్ చైన్ | The Park Hotels |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | Chennai, India |
చిరునామా | 601, Anna Salai, Nungambakkam Chennai, Tamil Nadu 600 006 |
భౌగోళికాంశాలు | 13°03′11″N 80°15′00″E / 13.052956°N 80.249923°E |
ప్రారంభం | 15 May 2002 |
యజమాని | The Park Hotels |
యాజమాన్యం | The Park Hotels |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 12 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | Hirsch Bedner Associates, Los Angeles |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 214 |
సూట్ల సంఖ్య | 15 |
రెస్టారెంట్ల సంఖ్య | 5 |
జాలగూడు | |
http://www.theparkhotels.com/chennai-park/chennai-park.html |
భారతదేశంలోని చెన్నై నగరంలో పార్క్ చెన్నై ఫైవ్ స్టార్ డీలక్స్ హోటల్ ఉంది.[1] అన్నా ఫ్లై ఓవర్ దగ్గరలో పాత జెమినీ స్టూడియోప్రాంగణంలోని అన్నాసాలై ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. చెన్నై నగరానికి గుండె కాయలాంటి అన్నాసాలై దగ్గరలో హోటల్ ఉండటం విశేషం. విదేశీయులు, వ్యాపారం కోసం, సెలవుల్లో గడపడానికి వచ్చే వారికి ఈ హోటల్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఏపీజే సురేంద్ర గ్రూపులో ఇది ఒక భాగంగా ఉంది. ఈ హోటల్ ను మే-15, 2002లో దాదాపు రూ. 1,000 మిలయన్ల పెట్టుబడితో స్థాపించారు.[2]
చెన్నై నౌకాశ్రయం నుంచి కేవలం 5 నిమిషాలు ప్రయాణిస్తే చెన్నై పార్క్ హోటల్ కు చేరుకోవచ్చు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ హోటల్ కేవలం 10 మైళ్ల దూరంలో ఉంటుంది.
ప్రస్తుత పార్క్ హోటల్ ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ అయిన జెమినీ స్డూడియో సమీపంలో ఉంది. 1940 లో స్థాపించిన జెమినీ స్టూడియో చారిత్రాత్మక సినీ నిర్మాణ సంస్థగా ఉంది. ఎస్.ఎస్.వాసన్ అనేతమిళ సినీ నిర్మాత, తన మిత్రుడైన కె.సుబ్రహ్మణ్యానికి చెందిన “మోషన్ పిక్చర్ ప్రొడ్యూషర్స్ కంబైన్స్ స్టూడియో”ను వేలంలో కొనుగోలు చేసి ఈ స్థానంలో జెమినీ స్టూడియో నిర్మించారు. మౌంట్ రోడ్డులో ఉన్న “మోషన్ పిక్చర్ ప్రొడ్యూషర్స్ కంబైన్స్ స్టూడియో” 1940లో జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా ధగ్దమైంది. ఇదే స్థానంలో జెమినీ స్టూడియో పేరుతో పునర్ నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఈ స్టూడియో భారత ఉపఖండంలోని దిగ్గజ సిని నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచింది.
1970 ప్రాంతంలో జెమినీ పిక్చర్స్ తన కార్యకలాపాలనను తగ్గించి తన స్టూడియోలో ఉన్న పరికరాలను అద్దె ప్రాతిపదికన వ్యాపారం సాగించింది. 1990లో స్టూడియో ప్రాంగణంలోని ఓ మూలన రెండు పెద్ద భవనాలను నిర్మించారు. 21వ శతాబ్దంలో కోల్ కతాకు చెందిన పార్క్ గ్రూపు హోటళ్ల సంస్థ ఈ రెండు భవనాలను కొనుగోలు చేసి వీటిని విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లుగా తీర్చిదిద్దింది. మే_15, 2002లో ఈ హోటల్స్ ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం ఇండియన్ బ్యాంకు వేలం పాటలో మరో బ్లాకును రూ.930 మిలియన్లకు కొనుగోలు చేసింది.[3] కొన్ని వివాదాల నేపథ్యంలో 2010లో చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ తో హోటల్ యాజమాన్యం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.[4]
కళాత్మకమైన ఈ హోటల్లో 127 డీలక్స్ గదులు, మరో 31 విలాసవంతమైన గదులు (లక్జరీ), 41 నివాస గదులు, 6 స్టూడియో సూట్లు, 5 డీలక్స్ సూట్లు, 3 ప్రీమియర్ సూట్లు, 1 రెసిడెన్సియల్ సూట్ వంటివి కలిపి మొత్తం 214 గదులున్నాయి.. లోటస్ పేరుతో థాయ్ రెస్టారెంట్ లో భోజనశాల ఉంది.[5] ఆరు సున్నా ఒకటి (601) బార్, పాస్టా-చోకో బార్, హోటల్ ఎనిమిదో అంతస్తులో అక్వా రెస్టారెంట్ కూడా ఉన్నాయి. నగరంలోని లెదర్ ఇండస్ట్రీ వారి కోసం లెదర్ బార్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.[6] ఈ హోటల్లో ప్రఖ్యాత షాపింగ్ కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. అతిథుల శారీరక దృఢత్వం, శరీర మర్ధన కోసం ప్రత్యేక వ్యాయామశాల కూడా ఈ హోటల్లో ఉంది. విదేశీ కరెన్సీ మార్చుకునే సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అధునాతన అలంకరణతో పాటు హార్డ్ వుడ్ ఫ్లోర్ తో పార్క్ హోటల్ మొత్తం ఏయిర్ కండిషన్డ్ చేయబడింది.
పూర్తి సౌకర్యాలతో కూడిన గదుల్లో మినీ బార్, బాత్ టబ్ లతో కూడిన స్నానాల గది ఉంటుంది. పార్క్ హోటల్ గదుల్లో సమాంతర తెరతో కూడిన టీవీ సౌకర్యంతో పాటు, రెయిన్ షవర్ సౌకర్యం ఉంటాయి. ఈ హోటల్లో గదులన్నీ మనసుకు ప్రశాంతను కలిగించే రంగుల్లో ఉంటాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిని కలిగించే మొత్తటి ఫోమ్ తో 10 అంగులాల మందంతో కూడిన పరుపులతో బెడ్స్ ఉంటాయి. అడగడుగునావిలాసవంతంగా ఉండే ప్రతి గదిలో 2-లైన్ల టెలిఫోన్ సౌకర్యంతో పాటు గదిలో సౌకర్యవంతంగా మాట్లాడుకునేందుకు వీలుగా కార్డ్ లెస్ ఫోన్, స్పీడ్ ఇంటర్నెట్ డాటా పోర్టు అందుబాటులో ఉంటాయి. పూర్తి స్థాయిలో ఫైవ్ స్టార్ సౌకర్యాలున్న ఈ హోటల్లో ఉచిత వాహన పార్కింగ్ వసతి ఉంది.
ఫోర్బ్ సంస్థ 2006లో ప్రకటించిన ఆట్రీయం (అతిపెద్ద అద్దాల మేడ, పెద్ద భవంతి) జాబితాలో చెన్నై పార్క్ హోటల్ ను చేర్చడంతో పాటు హోటల్ కు చెందిన ఇటాలియన్ చెఫ్ అంటోనియో కార్లుక్కియో రూపొందించిన మెనూ భారత్ లోని అతి ఎక్కువ ధర పలికే టాప్ 10 రెస్టారెంట్ల జాబితాలో చోటు సంపాందించింది.[7]