దిక్కట్ర పార్వతి

దిక్కట్ర పార్వతి
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతఎం.లక్ష్మీకాంతరెడ్డి
హెచ్.ఎం.సంజీవరెడ్డి
తారాగణంశ్రీకాంత్,
లక్ష్మి
ఛాయాగ్రహణంరవివర్మ
సంగీతంచిట్టిబాబు
విడుదల తేదీ
14 జూన్ 1974
దేశంభారతదేశం
భాషతమిళం

దిక్కట్ర పార్వతి 1973వ సంవత్సరానికిగాను తమిళ భాషలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 21వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఎంపికైన సినిమా.

నటీనటులు

[మార్చు]
  • లక్ష్మి
  • శ్రీకాంత్
  • వై.జీ.మహేంద్ర
  • పూర్ణం విశ్వనాథన్
  • టైపిస్ట్ గోపు

సాంకేతికవర్గం

[మార్చు]

రాజాజీ తమిళంలో వ్రాసిన దిక్కట్ర పార్వతి అనే ఒక చిన్నకథ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

ఒక పల్లెటూళ్ళో కురుప్పన్ చిన్న వ్యవసాయదారుడు. తని భార్య పార్వతి. వాళ్ళిద్దరిదీ అనుకూలవంతమైన దాంపత్యం. వాళ్ళకూ అందరిలాగే పేదరికం ప్రధాన సమస్యే అయినా, ముందు ముందు మంచి రోజులు వస్తాయనీ, కష్టాలను అధిగమిస్తే బంగారు భవిష్యత్తు తమదే అవుతుందనీ కలలు కంటూ వుంటారు.

వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వూళ్ళో వాళ్ళకు కూడా ఆ దంపతులంటే మంచి అభిప్రాయమే వుంది. ఇబ్బందుల్లో ఆదుకోవడానికి చుట్టు పక్కల వాళ్ళు కూడా వెనుకాడే వారు కాదు.

కురుప్పన్ ఆ వూళ్ళోని ఖాదర్‌ఖాన్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని రెండెడ్లు, బండి కొని ఆ వూరి సరుకులను పొరుగూరికి రవాణా చేయడం, తద్వారా డబ్బు సంపాయించడం ప్రారంభించాడు.

ఒకరోజు పొరుగూరు నుండి తిరిగి వస్తూవుంటే కరుప్పన్ తన మిత్రుడి బలవంతం కొద్దీ మొదటిసారిగా కల్లు ఎలా వుంటుందో రుచి చూశాడు. ఆ రోజు భార్యముందు పెద్ద తప్పు చేసిన వాడిలాగే ప్రవర్తించాడు.

రెండవరోజు వద్దనుకుంటూనే మళ్ళా త్రాగాడు. క్రమక్రమంగా అతని బండి కల్లు దుకాణం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోసాగింది. అలా చూస్తూండగానే పార్వతి కట్టుకున్న ఆశాసౌధాలు కూలిపోసాగాయి. చివరికి తమకున్న ఒకే ఒక బిడ్డ జబ్బుపడి, ప్రాణాపాయస్థితిలో వుంటే సమయానికి స్వయంగా మందు తీసుకొచ్చి అందజేయలేనంత మత్తులో పడిపోయాడు కురుప్పన్.

బిడ్డను, సంఘంలో పరపతినీ పోగొట్టుకున్న పార్వతి జీవితం దుర్భరమైంది. మరోప్రక్క అప్పులిచ్చినవాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఇల్లు గడవడానికి ఆమె కూలిపని కూడా చేయవలసి వచ్చింది.

అవకాశాలు లభిస్తే పేదవాళ్ళ దీనస్థితిని తమ వినోదానికి ఎరగా వాడుకునే ధనికులు ప్రతిచోటా వుంటారు. ఎప్పుడో పార్వతి మీద కన్ను వేసిన ఖాదర్‌ఖాన్ కొడుకు ఇస్మాయిల్ సమయం కోసం ఎదురు చూస్తూ ఒక రోజు, భర్త లేనప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తాగుబోతుగా మారి తనను హింసిస్తున్న భర్త, దుర్భర దారిద్ర్యం, చీకటి మయమైన భవిష్యత్తు ఆమెను నిస్సహాయురాలిగా చేశాయి. అప్పుడే వచ్చిన కురుప్పన్ ఆ దృశ్యాన్ని చూసి, ఆగ్రహావేశంతో ఇస్మాయిల్‌ను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు.

ఫలితంగా పార్వతి న్యాయస్థానంలో కూడా నిలబడవలసి వస్తుంది. న్యాయస్థానాలు ఎప్పుడూ బాహ్యదృష్టితోనే విచారణ జరుపుతాయి కానీ ఇటువంటి పార్వతుల జీవితాలు ఎందుకిలా నాశనమవుతున్నాయి, వాళ్ళ గమ్యం ఏమిటి?, వాళ్ళకెలా న్యాయం జరగాలి? అని విచారించలేవు. భర్తకు జైలు శిక్షపడడం, తనను కుటుంబ సభ్యులెవ్వరూ ఆదరించకపోవడంతో ఈ విశాల విశ్వంలో దిక్కులేని పార్వతి తన స్థానాన్ని అన్వేషిస్తూ బయలుదేరుతుంది. చివరికి అంతు తెలియని ఆమె జీవిత గమ్యానికి అంతమే కనిపిస్తుంది.[1]

నిర్మాణం

[మార్చు]

సాంఘిక జీవితంలో మద్యపానం సృష్టించే తీవ్రమైన పరిణామాలను ప్రతిబింబించే ఈ సినిమాను నవతరంగ్ బ్యానర్‌పై ఎం.లక్ష్మీకాంతరెడ్డి, హెచ్.వి.సంజీవరెడ్డి నిర్మించినారు. ఈ చిత్రానికి ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఋణ సహాయం లభించింది. ఈ చిత్రాన్ని రాజాజీ జన్మించిన హోసూరు సమీపంలోని దొరపల్లి అగ్రహారంలో రాజాజీ కథలో ఉద్దేశించిన ప్రదేశాలలోనే 18 రోజులలో షూటింగ్ జరిపారు.

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ తమిళ సినిమా ఎం.లక్ష్మీకాంతరెడ్డి, హెచ్.వి.సంజీవరెడ్డి గెలుపు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 October 1974). "దిక్కట్ర పార్వతి". విజయచిత్ర. 9 (4): 41.

బయటిలింకులు

[మార్చు]