దినేష్ ప్రతాప్ సింగ్ | |||
హార్టికల్చర్, వ్యవసాయ, మార్కెటింగ్, విదేశీ వాణిజ్యం, వ్యవసాయ ఎగుమతి శాఖల మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 | |||
ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2010 | |||
నియోజకవర్గం | రాయబరేలి స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భారతదేశం | 1967 అక్టోబరు 3||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | రాయ్‌బరేలి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఫిరోజ్ గాంధీ కళాశాల , కాన్పూర్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | [1] |
దినేష్ ప్రతాప్ సింగ్ (జననం 3 అక్టోబర్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికై, యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో హార్టికల్చర్ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవసాయం విదేశీ వాణిజ్యం, వ్యవసాయ ఎగుమతి శాఖల (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]
దినేష్ ప్రతాప్ సింగ్ 1967 అక్టోబరు 3న రాయ్‌బరేలి జిల్లాలోని గుణవర్ కమంగల్పూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1986లో రాయ్‌బరేలిలోని ఫిరోజ్ గాంధీ డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
దినేష్ ప్రతాప్ సింగ్ 2004లో సమాజ్ వాదీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2007లో సమాజ్ వాదీ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. దినేష్ ప్రతాప్ సింగ్ 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2010, 2016 శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. రాయ్‌బరేలీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ ప్రతినిధి కిషోరీ లాల్ శర్మను, ఇతర స్థానిక పార్టీ నాయకులతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఆయనను 2017లో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు.
దినేష్ ప్రతాప్ సింగ్ 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ చేతిలో 1,67,178 ఓట్లతో తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022లో బీజేపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో హార్టికల్చర్ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవసాయం విదేశీ వాణిజ్యం, వ్యవసాయ ఎగుమతి శాఖల (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పని చేస్తున్నాడు.[3]
దినేష్ ప్రతాప్ సింగ్‌ను 2024లో లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4][5][6]