పూర్తి పేరు | దిలీప్ కుమార్ బోస్ |
---|---|
దేశం | భారతదేశం |
జననం | 1921 పాట్నా |
మరణం | 30 డిసెంబరు 1996 (aged 74–75) కోల్‌కతా |
ఆడే విధానం | కుడిచేతి వాటం |
సింగిల్స్ | |
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |
వింబుల్డన్ | నాలుగో రౌండు (1948) |
డబుల్స్ | |
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |
వింబుల్డన్ | రెండో రౌండు (1947) |
Grand Slam Mixed Doubles results | |
వింబుల్డన్ | మూడో రౌండు (1948) |
దిలీప్ కుమార్ బోస్ (1921 - 1996 డిసెంబరు 30) భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను ఆసియా ఛాంపియన్‌షిప్ విజేత, ఇండియా డేవిస్ కప్ జట్టు సభ్యుడు. ఆట నుండి విరమణ తర్వాత, అతను కోచ్‌గా, నిర్వాహకుడిగా పనిచేశాడు.[1][2] ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ 2002 లో అతని పేరు మీద జీవితకాల సాఫల్య పురస్కారాన్ని స్థాపించింది.[3]
1949లో కలకత్తాలోని కలకత్తా సౌత్ క్లబ్‌లో జరిగిన తొలి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బోస్ సింగిల్స్ పోటీని గెలుచుకున్నాడు.[4][5] ఫలితంగా, అతను 1950 లో వింబుల్డన్‌లో 15వ సీడ్ సాధించాడు.[6] రెండో రౌండు మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన హాన్స్ వాన్ స్వోల్‌తో 6–4, 5–4 తో వెనకబడి ఉండగా, రిటైరై ఆ మ్యాచ్‌ను మధ్య లోనే వదులుకున్నాడు.[7][8] అంతకు కొద్ది రోజుల ముందే అతను మలేరియా నుండి కోలుకున్నాడు. ఆట ఆడవద్దని వైద్యులు సలహా కూడా ఇచ్చారు.[9] అదే సంవత్సరంలో, అతను బెర్లిన్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బిల్ సిడ్‌వెల్‌తో కలిసి డబుల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్నాడు.[10]
1949 లో కలకత్తాలో జరిగిన ఆసియా మొదటి అంతర్జాతీయ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల ప్రారంభ ఎడిషన్‌లో బోస్ సింగిల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్నాడు. ఆ సమయంలో భారతదేశపు నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు. 1950 జనవరి 1 న జరిగిన ఫైనల్‌లో స్వదేశీయుడు, దేశంలో రెండవ ర్యాంకరూ ఐన సుమంత్ మిశ్రాను 6–1, 6–2, 8–6 తో ఓడించాడు.[11]
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)