![]() | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దిలీప్ నారాయణ్ సర్దేశాయ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మార్‌గావ్, గోవా | 1940 ఆగస్టు 8|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2007 జూలై 2 ముంబై | (వయసు: 66)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | రాజ్‌దీప్ సర్దేశాయ్ (కుమారుడు) సాగరిక ఘోష్ (కోడలు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 103) | 1961 డిసెంబరు 1 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1972 డిసెంబరు 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1961–1973 | బొంబాయి క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1961–1965 | అసోసియేటెడ్ సిమెట్ కంపెనీ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo |
దిలీప్ నారాయణ్ సర్దేశాయి (1940 ఆగస్టు 8 - 2007 జూలై 2) భారతీయ క్రికెట్ ఆటగాడు. భారత జాతీయ జట్టు తరపున బ్యాట్స్‌మన్‌గా టెస్టులు ఆడాడు. భారతదేశం కోసం ఆడిన మొదటి గోవా క్రికెటర్ అతను. స్పిన్ బౌలింగును సమర్థంగా ఆడే భారతదేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడుగా అతన్ని పరిగణిసారు. భారతీయ బ్యాట్స్‌మన్లు సాధారణంగా స్పిన్‌కు వ్యతిరేకంగా మెరుగ్గా ఆడతారు అనే పేరు ఉంది.[1][2]
సర్దేశాయ్ ఒకప్పటి పోర్చుగీస్ భారతదేశంలోని (ప్రస్తుత భారతదేశంలోని గోవా రాష్ట్రంలో) మార్గోవ్‌లోని సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో [3] పుట్టి పెరిగాడు. అక్కడే న్యూ ఎరా హైస్కూల్‌లో చదివాడు. [4] 1950ల ప్రారంభంలో అతను పెరుగుతున్న రోజుల్లో ఈ ప్రాంతంలో క్రికెట్‌కి మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. 1957లో సర్దేశాయికి 17 ఏళ్ల వయసులో అతని కుటుంబం బొంబాయికి (ప్రస్తుతం ముంబై) తరలి వెళ్లింది.[5] అతను నగరంలోని విల్సన్ కళాశాలలో చదివాడు. అక్కడ అతని క్రికెట్ ప్రతిభను కోచ్ 'మాన్య' నాయక్ గుర్తించాడు. [6] సర్దేశాయ్, ముంబైలోని ఫోర్ట్‌లోని సిద్ధార్థ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో కూడా చదివాడు. [7]
సర్దేశాయ్ 1959-60లో ఇంటర్-యూనివర్సిటీ రోహింటన్ బారియా ట్రోఫీలో క్రికెట్‌లో తన మొదటి గుర్తింపును సాధించాడు. అక్కడ అతను 87 సగటుతో 435 పరుగులు చేశాడు. 1960-61లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుతో ఆడాల్సిన కంబైన్డ్ యూనివర్శిటీస్ టీమ్ కోసం ట్రయల్స్‌కు తనను పిలిచినట్లు అతను తర్వాత గుర్తు చేసుకున్నాడు. అతని సాంకేతికతకు ముగ్ధుడై, సెలెక్టర్ల ఛైర్మన్ లాలా అమర్‌నాథ్, అతనిని జట్టులోకి తీసుకున్నాడు. సర్దేశాయ్ 1960 నవంబరులో పూణేలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఫస్ట్‌క్లాస్ ఆట ఆడాడు. సర్దేశాయ్ ఆ మ్యాచ్‌లో తన ఏకైక ఇన్నింగ్స్‌లో 194 నిమిషాల్లో 87 పరుగులు చేశాడు. ఫీల్డింగ్‌లో హనీఫ్ మహ్మద్ క్యాచ్‌ను అందుకున్నాడు. [8] అతని తదుపరి గేమ్‌లో, టూర్‌లోని నాల్గవ టెస్ట్‌కు ముందు అదే పాకిస్థాన్ జట్టుతో బోర్డ్ ప్రెసిడెంట్స్ XI తరపున ఆడుతూ, అతను అజేయ శతకం (260 నిమిషాల్లో 106), [9] [5] సాధించాడు. మూడో వికెట్‌కి విజయ్ మెహ్రాతో కలిసి 134 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. . [10]
1961–62లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్దేశాయ్ యూనివర్సిటీ మ్యాచ్‌లో గుజరాత్‌పై 281 పరుగులు చేయడం మినహా, పెద్దగా రాణించలేదు. 1961 డిసెంబరులో కాన్పూర్‌లో జరిగిన ఇంగ్లండ్ భారత రెండో టెస్టు కోసం అతన్ని భారత జట్టు లోకి తీసుకున్నారు. టెస్టుకు ముందువరకు, అతను "దూకుడు స్ట్రోక్ ప్లేయర్"గా గుర్తింపు పొందాడు. [11] తన తొలి ఇన్నింగ్స్‌లో సర్దేశాయ్ 28 పరుగులు చేసి స్పిన్నర్ టోనీ లాక్‌ని ఖాళీగా ఉన్న స్లిప్ ప్రాంతం గుండా థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించే ప్రయత్నంలో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ 108 నిమిషాల పాటు కొనసాగింది. [12] సర్దేశాయ్ ఆ సీజన్‌లో వెస్టిండీస్‌లో పర్యటించాడు, ఐదు టెస్టుల్లో మూడింటిలో ఆడాడు. అతను బార్బడోస్‌తో జరిగిన ఓ టూర్ గేమ్‌లో కెప్టెన్ నారీ కాంట్రాక్టర్‌కి ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నాడు. సర్దేశాయ్ తన వికెట్ కోల్పోయిన తర్వాత చార్లీ గ్రిఫిత్ వేసిన బంతి కాంట్రాక్టరు తలపై తగిలి గాయపడ్డాడు. [13] కాంట్రాక్టర్ గాయపడడంతో సర్దేశాయికి టెస్టు జట్టులో చోటు దొరికింది. అతను బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌లో 31, 60 పరుగులు చేశాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్సుల్లోనూ డకౌటయ్యాడు. తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. సర్దేశాయ్ 1963-64లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టులో 79, 87 పరుగులతో మొత్తం 449 పరుగులు చేశాడు. ఈ పరుగుల కారణంగా ఫాలో ఆన్ తర్వాత భారత్ డ్రా చేసుకోగలిగింది.
1964-65లో న్యూజిలాండ్‌కు వ్యతిరేకంగా, బొంబాయిలో సర్దేశాయ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఢిల్లీలో విజయానికి బాటలు వేసిన అతి వేగవంతమైన సెంచరీ చేశాడు. బాంబేలో న్యూజిలాండ్ భారత్‌ను ఫాలో ఆన్ చేయవలసి వచ్చింది. అయితే సర్దేశాయ్ అజేయ డబుల్ సెంచరీతో భారత్ దాదాపు మ్యాచ్ గెలిచినంత పనైంది. అతను 1966-67లో వెస్టిండీస్‌తో ఆడాడు, ఆపై 1967లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు. అక్కడ అతను లార్డ్స్‌లోని పెవిలియన్‌లో మెట్ల మీద గాయపడి, హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్టుకు దూరమయ్యాడు. కోలుకుని తిరిగి లార్డ్స్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో వేలు విరగడంతో అతని పర్యటన అక్కడితో ముగిసింది. 1967-68లో ఆస్ట్రేలియాలో రెండు టెస్టుల తర్వాత గాయం అవడంతో పాటు, వరుస వైఫల్యాల కారణంగా అతన్ని జట్టునుండి తొలగించారు.
1970-71లో వెస్టిండీస్‌లో భారత పర్యటనకు ఎంపికయ్యే ముందు వరకు, సర్దేశాయ్ కెరీర్ ముగిసినట్లే అనిపించింది. కింగ్‌స్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ 75 పరుగులకే మొదటి ఐదు వికెట్లు కోల్పోయిన సమయంలో సర్దేశాయ్ 212 పరుగుల స్కోరు చేసాడు. మొత్తం స్కోరు 387కి చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తదుపరి టెస్టులో అతని 112 పరుగులు వెస్టిండీస్‌పై భారత మొదటి విజయానికి దారితీసింది. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ వెలుపల డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. నాలుగో టెస్టులో భారత్ 6 వికెట్లకు 70 పరుగులు చేసిన తర్వాత అతను మరో 150 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతను చేసిన 642 పరుగులు ఐదు రోజుల పాటు రికార్డుగా నిలిచింది. ఆ తరువాత సునీల్ గవాస్కర్ దానిని దాటాడు. వెస్టిండీస్‌పై సిరీస్‌లో ఇది భారతదేశపు మొదటి విజయం. సెలెక్టర్ల ఛైర్మన్ విజయ్ మర్చంట్ సర్దేశాయిని "భారత క్రికెట్ పునరుజ్జీవనోద్యమ వ్యక్తి" అని పిలిచారు. [14] 1971లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై భారత విజయంలో సర్దేశాయ్ 54, 40 పరుగులు చేశాడు. ఇది మరో సిరీస్ విజయానికి దారితీసింది. మరో టెస్టు తర్వాత అతని కెరీర్ ముగిసింది. సర్దేశాయ్, 1972-73 సీజన్ ముగింపులో అన్ని క్రికెట్ల నుండి రిటైర్ అయ్యాడు.
సర్దేశాయ్ 1961, 1973 మధ్య 13 సీజన్లలో రంజీ ట్రోఫీలో బాంబే తరపున ఆడాడు.[15] 10 ఫైనల్స్‌తో సహా, అతనున్న జట్టు ఎప్పుడూ ఓడిపోలేదు. 1967 ఫైనల్‌లో రాజస్థాన్‌పై 199 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత అదే జట్టుతో జరిగిన సెమీ-ఫైనల్‌లో, అతను కైలాష్ గట్టాని చేతిలో మన్కడెడ్ అయ్యాడు. సర్దేశాయ్ చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ 1972-73లో మద్రాస్‌తో జరిగిన ప్రసిద్ధ రంజీ ట్రోఫీ ఫైనల్. ఇది మూడవ రోజు మొదటి బంతికి ముగిసింది. [16] సర్దేశాయ్ మూడు దేశీయ సీజన్లలో 1,000కు పైగా ఫస్ట్-క్లాస్ పరుగులను సాధించాడు, 1964-65లో కెరీర్ బెస్ట్ 1,429 పరుగులు, ఇందులో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ తరపున ఇండియన్ స్టార్లెట్స్ తో జరిగిన మొయినుద్దౌలా కప్పు ఫైనల్‌లో అతని అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు 222 చేసాడు. [17]
సర్దేశాయ్ మొదటిసారిగా నందిని పంత్‌ను (జననం సుమారు 1945) [18] ముంబైలోని బెర్రీస్ రెస్టారెంట్‌లో ఆమె తన పరీక్షల తర్వాత సెలవుల్లో కలుసుకున్నారు. సర్దేశాయ్ అప్పట్లో యూనివర్సిటీ క్రికెటర్. 1961–62లో భారత జట్టుతో కరేబియన్ పర్యటన సందర్భంగా, కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకునే ముందు ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారు. [18] [19] పంత్ 35 సంవత్సరాలు సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఆ తర్వాత 2015 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలిగా పనిచేసింది.[20] [21] ఆమె ప్రస్తుతం ముంబైలోని కొన్ని ప్రముఖ కళాశాలల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉంది. [22] [23] సర్దేశాయి బంధువు సోపాందేవ్ కూడా క్రికెట్ ఆటగాడే, అతను రాజ్‌పుతానా తరపున ఫస్ట్-క్లాస్ స్థాయిలో వికెట్ కీపర్‌గా ఆడాడు. [24] సర్దేశాయిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు: కొడుకు రాజ్‌దీప్, ఇద్దరు కుమార్తెలు. రాజ్‌దీప్ టెలివిజన్ జర్నలిస్టు, మాజీ క్రికెటర్. ఒక క్రికెటర్‌గా, అతను జర్నలిజంలో వృత్తిని ప్రారంభించే ముందు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి ఆడాడు.[25] అతను 2014లో రాజీనామా చేయడానికి ముందు IBN18 నెట్‌వర్క్‌కి ఎడిటర్-ఇన్-చీఫ్; అతని భార్య సాగరిక ఘోష్ కూడా జర్నలిస్టు. దిలీప్ కుమార్తెలలో ఒకరైన షోనాలి, వాషింగ్టన్ DC [26] లో ప్రపంచ బ్యాంకులో సీనియర్ సామాజిక శాస్త్రవేత్త.
క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత, సర్దేశాయ్ ముంబై, గోవాలోని తన నివాసాలలోకాల్ం గడిపాడు. 2007 జూన్‌లో, ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకున్నాడు. అతను బహుళ అవయవ వైఫల్యంతో 2007 జూలై 2 న మరణించాడు. [27] [28] మరుసటి రోజు ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో కుమారుడు రాజ్‌దీప్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. [29]
సర్దేశాయిని 'సర్దీ-సింగ్' అని పిలుస్తారు. 1970–71లో పర్యటన సందర్భంగా, ఒక విమానాశ్రయంలో సర్దేశాయ్‌ను మీరు డిక్లేర్ చేయాల్సింది ఏమైనా ఉందా అని అడిగారు. 'నేనిక్కడికి కొన్ని పరుగులతో వచ్చాను', 'వెళ్ళేప్పుడు మరికొన్ని తీసుకు వెళ్తాను' అని అతను బదులిచ్చాడు. 2018 ఆగస్టు 8 న, గూగుల్, సర్దేశాయి 78వ జయంతి సందర్భంగా ఒక డూడుల్ ప్రదర్శించి స్మరించుకుంది. [30] [31]
గోవా ప్రభుత్వం లోని డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ 2009లో దిలీప్ సర్దేశాయ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డును నెలకొల్పింది. ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం (29 ఆగస్టు) సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఈ పురస్కారంలో సర్దేశాయి కాంస్య ఫలకం, ప్రశంసా పత్రం, రూ 2,00,000 సొమ్మునూ ఇస్తారు.[32] గత సంవత్సరంలో ఏదైనా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన గోవా క్రీడాకారులకు ఇది ఇస్తారు. [33]
డబుల్ సెంచరీలు
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)