దిలీప్ సింగ్ భూరియా | |||
ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 2002-2004 | |||
పదవీ కాలం 1980 - 1998 | |||
నియోజకవర్గం | రత్లాం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 18 జూన్ 1944 | ||
మరణం | 2015 జూన్ 24 గుర్గావ్ , భారతదేశం | (వయసు 71)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
మూలం | [1] |
దిలీప్ సింగ్ భూరియా (18 జూన్ 1944 - 24 జూన్ 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రత్లాం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
దిలీప్ సింగ్ భూరియా కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1972లో పెట్‌లావాడ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1980లో తొలిసారి రత్లాం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1996 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో ఓడిపోయి 2014లో తిరిగి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. దిలీప్ సింగ్ భూరియా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 2002 నుండి 2004 వరకు జాతీయ ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.
దిలీప్ సింగ్ భూరియా 2015 జూన్ 25న గుర్గావ్‌లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2]