దీక్షా దాగర్ | |
---|---|
— Golfer — | |
![]() | |
Personal information | |
జననం | చప్పర్, ఝజ్జర్, హర్యానా, భారతదేశం | 14 డిసెంబరు 2000
ఇత్తు | 5 అడుగుల 9 అంగుళాలు |
జాతీయత | ![]() |
Career | |
Turned professional | 2019 |
Current tour(s) | లేడీస్ యూరోపియన్ టూర్ |
Professional wins | 3 |
Number of wins by tour | |
Ladies European Tour | 2 |
Other | 1 |
Best results in LPGA Major Championships | |
LPGA Championship | DNP |
U.S. Women's Open | DNP |
Women's British Open | T21: 2023 |
The Evian Championship | CUT: 2019, 2023 |
దీక్షా దాగర్ (జననం 14 డిసెంబర్ 2000) ఒక భారతీయ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి, ఆమెకు వినికిడి లోపం కూడా ఉంది.[1] దీక్షా దాగర్ 2017 సమ్మర్ డెఫ్లింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, మహిళల వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్ లో పాల్గొని రజత పతకం సాధించారు.[2] దీక్షా 2018 ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించింది.[3] 2019 లో, ఆమె అదితి అశోక్ తరువాత యూరోపియన్ టూర్లో గెలిచిన రెండవ భారతీయ మహిళా గోల్ఫ్ క్రీడాకారిణిగా నిలిచింది, 18 సంవత్సరాల వయస్సులో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మహిళగా నిలిచింది.[4][5]
దక్షిణాఫ్రికా గోల్ఫర్ పౌలా రెటో ఆలస్యంగా వైదొలగడంతో 2020 సమ్మర్ ఒలింపిక్స్లో మహిళల వ్యక్తిగత ఈవెంట్లో పాల్గొనాలని 2021 జూలైలో ఆమెకు అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య నుండి ఆహ్వానం అందింది.[6] ఆమె చివరికి ఒలింపిక్స్, డెఫ్లింపిక్స్ రెండింటిలోనూ పోటీపడిన మొదటి గోల్ఫ్ క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచింది.[7]
2000 డిసెంబర్ 14న జన్మించిన దీక్షా ఆరేళ్ల వయసులోనే వినికిడి పరికరాలు ధరించడం ప్రారంభించింది.[8] ఆమె తన ఏడవ ఏట నుండి, వినికిడి లోపం ఉన్న తన సోదరుడు యోగేష్ దాగర్ తో కలిసి గోల్ఫ్ ఆడటం ప్రారంభించింది.[9] ఆమె తండ్రి కల్నల్ నరీందర్ డాగర్, మాజీ స్క్రాచ్ గోల్ఫ్ క్రీడాకారుడు, సైన్యంలో పనిచేశారు.
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)