దీపా దాస్‌మున్షీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 15వ లోక్‌సభలో రాయ్‌గంజ్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికై 2012 అక్టోబరు నుండి 2014 మే వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. దీపా దాస్‌మున్షీని 2023 డిసెంబరు 23న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది.[1]
దీపాదాస్ మున్షీ భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్‌కతాలో 1960 జూలై 15న బెనోయ్ ఘోష్, దుర్గా ఘోష్ దంపతులకు జన్మించింది. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి డ్రామాటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది.
దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుడు & మాజీ కేంద్ర మంత్రి ప్రియారంజన్ దాస్ మున్షీని 1994 ఏప్రిల్ 15న వివాహం చేసుకుంది.[2] వారికీ ఒక కుమారుడు ప్రియదీప్ దాస్ మున్షీ ఉన్నాడు.
దీపాదాస్ మున్షీ తన భర్త అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2006లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో గోల్‌పోఖర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3] ఆమె 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 ఆగస్టు 31న సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయ కమిటీ సభ్యురాలిగా ఆ తరువాత 2012 అక్టోబరు 28 నుండి 2014 మే 16 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర రాష్ట్ర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసింది.
దీపా దాస్‌మున్షీని 2023 ఆగష్టు 1న 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సీనియర్ పరిశీలకురాలిగా[4][5], 2023 డిసెంబరు 23న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమించింది.[6]