దుబాయ్ హిందూ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°15′53″N 55°17′48″E / 25.264705°N 55.296759°E |
దేశం | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
రాష్ట్రం | దుబాయ్ |
ప్రదేశం | బర్ దుబాయ్ |
సంస్కృతి | |
దైవం | శ్రీకృష్ణుడు, శివుడు |
దుబాయ్ హిందూ దేవాలయం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో ఉన్న హిందూ దేవాలయం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఏకైక హిందూ దేవాలయమిది.[1]
ఈ దేవాలయానికి రెండు వైపులా రెండు బలిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు, కృష్ణుడు, షిర్డీ సాయిబాబా కొలువై ఉన్నారు. దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్వహించబడుతోంది. ఇక్కడ వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలు కూడా జరుగుతాయి.[2]
షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ 1958లో బర్ దుబాయ్‌లోని పాత-కాలపు దుకాణాల వారెన్ పైన మొదటి అంతస్తులో హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి అనుమతించారు.[3][4] 1958లో నిర్మించడానికి అనుమతి పొందిన ఏకైక దేవాలయమిది.
ఇక్కడున్న షాపింగ్ సెంటర్‌లోని ఒక సందు ద్వారా దేవాలయానికి చేరుకోవచ్చు. దేవాలయ హాలు కింద చిన్నచిన్న దుకాణాలు కూడా ఉన్నాయి. వాటిలో పూజకు అవసరమైన పూలు, జాస్-స్టిక్స్ వంటి వస్తువులను విక్రయిస్తారు.