దుర్గం చెరువు హైదరాబాద్ , నగరంలో రాయదుర్గ, మాధాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. దీనిని రాయదుర్గ చెరువు అని కూడా పిలుస్తారు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తస సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. నీరు మురికిగా మారాయి అందువల్ల బోటింగ్, హోటల్ వంటివి విజయవంతం కాలేదు. కానీ చూపులకు దూరం నుండి అందంగానే ఉంది.
జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలో ఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది. రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలంలోనే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మించింది.[1]
చెరువు పరిరక్షణలో భాగంగా చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ ఎస్టీపీని 2023 సెప్టెంబరు 25న రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[2]
ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చడంలో భాగంగా దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జికి ఇరు వైపులా 8 కోట్ల రూపాయల వ్యయంతో 40మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఏర్పాటుచేసిన రెండు మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్‌లను 2023 సెప్టెంబరు 25న ప్రారంభించబడింది. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ ఫౌంటెన్ షో ఉంటుంది.[2][3]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)