విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం, ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని కాండ్ల రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.[7][8]
గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.[9] ఒక చిన్న పోర్ట్ భీమునిపట్నం వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.[10] కాకినాడ పోర్ట్ లోని ఒక భాగంగా 1997 సం.లో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రారంబించారు.[11] పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.[12]మచిలీపట్నం వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.[13]
ఇతర అభివృద్ధి పనులు ===
విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు, అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం.
సింధియా షిప్‌యార్డు పేరుతో 1941 సం.లో స్థాపించి, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ నకు షిప్‌యార్డు ఒక భాగంగా నిర్మించబడి, అది హిందూస్థాన్ షిప్‌యార్డు గా 1961 లో మారింది.[14] విశాఖపట్నం రిఫైనరీ, తూర్పు తీరంలోని మొదటి నూనె శుద్ధి కర్మాగారం, అది 1957 లో, కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ లిమిటెడ్‌చే స్థాపించబడింది. తరువాత 1976 లో భారతదేశం యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హిందూస్తాన్ పెట్రోలియంలో 1978 లో విలీనం చేశారు.[15] విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, భారతదేశంలో మొట్ట మొదటి తీరం ఆధారిత స్టీల్ ప్లాంట్ 1992 సం.లో ప్రారంబించారు.[16]
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం, గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే 1845 సం. ప్రాంతములో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది, ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.[17] చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన మద్రాస్ రైల్వే 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే గా 1858 సం.లో ఏర్పాటైంది.[18] భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో కర్నాటిక్ రైల్వే లో విలీనం చేయబడి, 1874 సం.లో దక్షిణ భారతీయ రైల్వే గా పేరు మార్చబడింది.
దక్షిణ మరాఠా రైల్వే యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం విజయవాడ (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.[19] 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.[20][21] ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.[19], [22] 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.[19] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[23]
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[24]
1965 సంవత్సరములో చెన్నై మెయిల్, భారత లోకోమోటివ్ తరగతి ( డబ్ల్యుడిఎమ్ - 1 ) / (డబ్ల్యుడిఎమ్- 2 ) అనే ఒక డీజిల్ ఇంజన్‌తో దక్షిణ తూర్పు రైల్వే జోన్ పరిధిలో హౌరా - చెన్నై మార్గములో నడిచిన మొట్ట మొదటి రైలు.[25] ఈ విశాఖపట్నం-విజయవాడ మార్గము అనునది 1997వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ (ఎలక్ట్రిఫికేషన్) చేయబడింది. అదేవిధముగా, హౌరా-చెన్నైమార్గము కూడా 2005 వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ జరిగింది.[26]
ఖరగ్‌పూర్-విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైలు మార్గాన్ని " గ్రూప్ బి "గా వర్గీకరించారు, ఈ మార్గంలో రైళ్ళు గరిష్ఠంగా గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. ఈ మార్గంలోని బ్రాంచి లైన్లలో మాత్రం గరిష్ఠంగా గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.[27]
↑"Coastal Plains of India". Country facts – the world at your finger tips. Archived from the original on 2013-05-30. Retrieved 2013-01-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"The Coastal Plains of India". Zahie.com. Archived from the original on 2019-09-18. Retrieved 2013-01-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Port of Visakhapatnam". History. Vizagport. Archived from the original on 2012-11-11. Retrieved 2013-01-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Bheemunipatnam Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-03-10. Retrieved 2013-01-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Kakinada Seaports Ltd". Archived from the original on 2012-07-02. Retrieved 2013-01-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Kakinada Deep Water Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 2013-01-26. Retrieved 2013-01-25. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Machilipatnam Port". Department of Ports, Govt. of Andhra Pradesh. Archived from the original on 2013-01-23. Retrieved 2013-01-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Rashtriya Ispat Nigam Ltd". ICVL. Archived from the original on 2016-03-04. Retrieved 2013-01-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 2013-01-19.
↑"History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్