దేవదాస్ | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య టి |
నిర్మాత | సి. అశ్వినీదత్ |
తారాగణం | అక్కినేని నాగార్జున నాని రష్మికా మందన్న ఆకాంక్ష సింగ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్‌దత్. ఎస్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | వియాకామ్18 మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 159 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹20 కోట్లు[2] |
బాక్సాఫీసు | est. ₹50 కోట్లు[3] |
దేవదాస్ 2018, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[4] వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, నాని, రష్మికా మందన్న, ఆకాంక్ష సింగ్ నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2019, నవంబరులో జీ స్టూడియోస్ సంస్థ డాన్ ఔర్ డాక్టర్ పేరుతో అనువాదం చేసింది.[5]
పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దేవ (నాగార్జున), తనను ఆదరించి పెంచిన దాదా (శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు. దేవ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దేవాను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. దీంతోపాటు దాదాను చంపిన డేవిడ్ (కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్ దాడిలో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసినా కూడా పోలీసులకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన దాస్, తరువాత దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పోలీసుల నుంచి, డేవిడ్ గ్యాంగ్ నుంచి దేవ తప్పించుకున్నాడా, దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా అన్నది మిగతా కథ.[6]
ఇది హైదరాబాదు మెట్రో రైలు లో చిత్రీకరణ జరిగిన తొలిచిత్రం.[7][8]
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2018, సెప్టెంబరు 21న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, సినీరంగం ముఖ్యుల సమక్షంలో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[9] పాటలకు మిశ్రమ స్పందన లభించింది.[10]
దేవదాస్ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 21 సెప్టెంబరు 2018 | |||
Recorded | 2018 | |||
Genre | పాటలు | |||
Length | 29:16 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | మణిశర్మ | |||
మణిశర్మ chronology | ||||
|
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వారు వీరు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య | 4:26 |
2. | "చెట్టు కింద డాక్టర్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | పద్మలత | 5:10 |
3. | "లక లక లకుమికర (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | నురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ | 4:53 |
4. | "హేయ్ బాబు (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్, రమ్య బెహరా | 5:00 |
5. | "ఏమో ఏమో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | సిద్ శ్రీరామ్, రమ్య బెహరా | 4:26 |
6. | "మనసేదో వెతుకుతూ ఉంది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | యాజిన్ నిజార్, అనురాగ్ కులకర్ణి | 5:21 |
మొత్తం నిడివి: | 29:16 |
ఈ చిత్రానికి సినీ విమర్శకుల, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.[11][12][13][14]
రేటింగ్
కార్యక్రమ తేది | అవార్డు | విభాగం | విజేత, నామినీ | ఫలితాలు | మూలాలు |
---|---|---|---|---|---|
15 & 16 ఆగస్టు 2019 | దక్షణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు | ఉత్తమ ప్రతినాయకుడు – తెలుగు | కునాల్ కపూర్ | ప్రతిపాదించబడింది | [17] |