దేవయాని | |
2014 లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో దేవయాని | |
జన్మ నామం | సుష్మా జయదేవ్ |
జననం | బొంబాయి మహారాష్ట్ర | 1974 జూన్ 22
ఇతర పేర్లు | దేవయాని రాజకుమరన్ |
భార్య/భర్త | రాజ కుమరన్ |
ప్రముఖ పాత్రలు | సుస్వాగతం నాని |
దేవయాని ప్రముఖ భారతీయ సినీ నటి. ఈమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించింది. వీటిలో కొన్ని హిందీ సినిమాలు, ఒక బెంగాళీ సినిమా కూడా ఉంది. దేవయాని పలు టెలివిజన్ ధారావాహిక లలో కూడా నటించింది. కాదల్ కొట్టై, సూర్యవంశం, భారతి సినిమాలలో తన నటనకు గాను తమిళనాడు రాష్ట్ర సినిమా పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు అందుకున్నది.[1][2] ఈమె సన్ టీవీలో కొల్లంగల్, ముహూర్తం అనే ధారావాహికల్లో కూడా నటించింది.
దేవయానికి తల్లితండ్రులు పెట్టిన పేరు సుష్మా. ఈమె ముంబైలో ఒక కొంకణీ కుటుంబంలో జన్మించింది.[3] ఈమె తండ్రి జయదేవ్, తల్లి లక్ష్మి.[4] ఈమెకు నకుల్, మయూర్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు. నకుల్ తమిళ సినిమా రంగంలో నటుడు, గాయకుడుగా పనిచేస్తున్నాడు.[5] మయూర్ ఇటీవలే ఒక సినిమాలో నటుడుగా ఆరంగేట్రం చేశాడు.[6] దేవయాని, తనతో కొన్ని సినిమాలలో కలిసి పనిచేసిన తమిళ సినిమా దర్శకుడు రాజకుమారన్ ను చాలా ఏళ్లుగా ప్రేమించింది. ఇరువురి పెద్దవాళ్ళు వారి ప్రేమను అంగీకరించకపోవటంతో పారిపోయి[7] 2001 ఏప్రిల్ 9న ఒక గుడిలో పెళ్ళిచేసుకున్నారు.[8][9] వీరికి ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.[10]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)