దేవేంద్ర నాగ్‌పాల్ | |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | హరీష్ నాగ్‌పాల్ | ||
---|---|---|---|
తరువాత | కన్వర్ సింగ్ తన్వర్ | ||
నియోజకవర్గం | అమ్రోహా[1] | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2002 - 2007 | |||
ముందు | రిఫాకత్ హుస్సేన్ | ||
తరువాత | ఫర్హత్ హసన్ | ||
నియోజకవర్గం | హసన్‌పూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] మొరాదాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1971 జనవరి 1||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ లోక్ దళ్ | ||
నివాసం | ధనౌరా & న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | కెజికె పిజి కళాశాల, మొరాదాబాద్ . | ||
వృత్తి | సామాజిక కార్యకర్త , రాజకీయ నాయకుడు . |
దేవేంద్ర నాగ్‌పాల్ ( జననం 1 జనవరి 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
దేవేంద్ర నాగ్‌పాల్ రాజకీయాల పట్ల ఆసక్తితో వచ్చి జిల్లా పంచాయితీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2002లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దేవేంద్ర నాగ్‌పాల్ ఆ తరువాత రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పరిశ్రమపై కమిటీ & పిటిషన్లపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
దేవేంద్ర నాగ్‌పాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జూన్ 2013లో నాగ్‌పాల్‌తో పాటు మరో ఎంపీ సారిక దేవేంద్ర సింగ్ బఘేల్‌ను పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నుండి బహిష్కరించాడు.[2][3] ఆయన ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2016లో పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నౌగవాన్ సాదత్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]