దేవేంద్ర మహదేవ్‌రావు భూయార్ | |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 22 | |||
ముందు | అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే | ||
---|---|---|---|
తరువాత | చందు ఆత్మారామ్‌జీ యావల్కర్ | ||
నియోజకవర్గం | మోర్షి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | స్వాభిమాని పక్ష (2004-2024) |
దేవేంద్ర మహదేవ్‌రావు భూయార్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోర్షి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
దేవేంద్ర భూయార్ స్వాభిమాని పక్ష ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోర్షి శాసనసభ నియోజకవర్గం నుండి స్వాభిమాని పక్ష అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండేపై 9,791 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయనను స్వాభిమాని పక్ష పార్టీ నుండి 2024 మార్చి 25న బహిష్కరించారు.[3]
దేవేంద్ర భూయార్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందు ఆత్మారామ్‌జీ యావల్కర్‌పై 64,988 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, వరుద్ తహశీల్‌లో 2024లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం చేసే యువకులను అందమైన అమ్మాయిలు పెండ్లి చేసుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.[5]
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)