దేశముదురు (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
---|---|
నిర్మాణం | డి.వి.వి. దానయ్య |
రచన | పూరీ జగన్నాధ్ |
తారాగణం | అల్లు అర్జున్, హన్సికా మోట్వాని, ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, జీవీ, అజయ్, రఘుబాబు, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, రాజేష, వంశీ, రమాప్రభ, కోవై సరళ, తెలంగాణ శకుంతల సుప్రీత్ జయప్రకాశ్ రెడ్డి ఎం. ఎస్. నారాయణ |
సంగీతం | చక్రి |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | యూనివర్శల్ మీడియా |
పంపిణీ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | జనవరి 12, 2007 |
భాష | తెలుగు |
దేశముదురు 2007, జనవరి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, హన్సికా మోట్వాని, ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, అజయ్, రఘుబాబు, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వంశీ, రమాప్రభ, కోవై సరళ, తెలంగాణ శకుంతల తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించారు.
ఒక టి.వి చానల్లో పనిచేసే బాలగోవింద్ (అల్లు అర్జున్) దూల్ పేటలో గుడుంబా కాయటం షూట్ చేసేందుకు తన టీం వాళ్ళతో కలసివెళతాడు. అక్కడ ఒకతన్ని గూండాలు హత్య చేయబోతే వాళ్ళను ఎదుర్కొని అతడిని కాపాడుతాడు. ఆగొడవలో అక్కడ పెద్ద గూండా అయిన తంబిదురై (ప్రదీప్ రావత)} కొడుకు మురుగేశన్ (సుబ్బరాజు)ను బలంగా కోమాలోకి వెళ్ళేలా కొడతాడు. అది తెలుసుకొన్న బాలగోవింద్ తండ్రి (చంద్రమోహన్) అతడిని ట్రావెల్ ఇండియా అనే ఎపిసోడ్ కోసం కులూమనాలి పంపిస్తాడు. అక్కడ వైశాలి (హన్సికా మోత్వాని) అనే సన్యాసిని ప్రేమలోపడతాడు బాలగోవింద్. అతి కష్టంగా ఆమె ప్రేమను పొందుతాడు. అక్కడ ఆమెను హైదరాబద్ గూండాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోవడంతో ఆమెకోసం తిరిగి హైదరాబాద్ వస్తాడు. ఆమెను వెతుకుతూ దూల్ పేటకు వెళ్ళిన బాలగోవిందును చిన్న ప్రమాదం నుండి ఒకప్పుడు తను రక్షించిన అతడు కనిపించి రక్షిస్తాడు. అతడు ఇలా చెప్తాడు- వైశాలి వాళ్ళ నాన్న దగ్గర తను పనిచేస్తుండేవాడిననీ వైశాలి నాన్నను తంబిదురై హత్యచేసి వాళ్ళ ఆస్తిని తన చేతిలోకి తీసుకొన్నాడనీ అయితే ఆస్తి మొత్తం వైశాలి పేరున ఉండటంతో ఆమెను తన కొడుకు మురుగేశంకు ఇచ్చి పెళ్ళిచేసి ఆస్తి రాయించుకొన్నాక చంపే ప్రయత్నాలలో ఉన్నాడనీ చెపుతాడు. అక్కడినుండి బాలగోపాల్ తన టీం వాళ్ళతో కలిసి తంబిదురై అంతుచూసి వైశాలిని పెళ్ళాడటంతో కథ ముగుస్తుంది.
చక్రి సంగీతం కూర్చిన పాటలన్నీ హిట్ అయ్యాయి. పొటోగ్రఫీ బావుంది. కులూమనాలి అందాలను బాగా చూపించారు. పూరి జగన్నాధ్ సంబాషణలు వాడిగా బాగున్నాయి. మాస్ పదాలను కావలసిన చోట్ల వాడటంలో జగన్నాధుకు మంచి అనుభవం ఉంది.