దేశస్థ బ్రాహ్మణులు, ఒక హిందూ బ్రాహ్మణ ఉపవర్గం. వీరు ప్రధానంగా భారత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు.[1] దేశస్థ అనే పదం సంస్కృత దేశ (దేశం), స్థ (నివాసి) నుండి వచ్చింది. అంటే అక్షరాలా "దేశవాసులు" అని దీని అర్థం.[2][3] కృష్ణ, గోదావరి నదుల లోయలు, పశ్చిమ కనుమల ప్రక్కనే ఉన్న దక్కన్ పీఠభూమి లోని ఒక భాగాన్ని సమిష్టిగా "దేశ" అని పిలుస్తారు - ఇదే దేశస్థ బ్రాహ్మణుల అసలు నివాసం.[4]
దేశస్థ బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం లోని పంచ ద్రావిడ బ్రాహ్మణ వర్గీకరణ పరిధిలోకి వస్తారు.[5] కర్హాడే, కొంకణస్థ బ్రాహ్మణులతో పాటు, మరాఠీ మాట్లాడే దేశ బ్రాహ్మణులను మహారాష్ట్ర బ్రాహ్మణులు అని పిలుస్తారు, ఇది మహారాష్ట్రలో ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన దక్కన్ పీఠభూమి యొక్క బ్రాహ్మణ ఉపవర్గాలను సూచిస్తుంది,[6] కర్ణాటక లోని దక్కను పీఠభూమి ప్రాంతంలో నివసించే కన్నడ మాట్లాడే దేశస్థ బ్రాహ్మణులను కర్ణాటక బ్రాహ్మణులు అని పిలుస్తారు.[7][8][9]
దేశస్థ బ్రాహ్మణులలో రెండు ప్రధాన ఉప విభాగాలు ఉన్నాయి, దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు, దేశస్థ యజుర్వేది బ్రాహ్మణులు. ఈ రెండు ఉప సమూహాల మధ్య వివాహాలు జరగడం చాలా సాధారణం.[10][6]
దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు ఋగ్వేదాన్ని, అందులో చెప్పిన ఆచారాలనూ అనుసరిస్తారు.[11] దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులలో విభిన్న భాషా ప్రాంతాల కుటుంబాలు ఉన్నాయి. దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులులో మరాఠీ, కన్నడ, తెలుగు కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా వివాహాలు ఒకే భాష మాట్లాడే కుటుంబాలలో జరుగుతాయి. కాని వివాహాలు మరాఠీ, కన్నడ, తెలుగు మాట్లాడే కుటుంబాల మద్యలో కూడా తరచుగానే జరుగుతూంటాయి.[12] దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు, ఇతర తెలుగు బ్రాహ్మణులు,, ఇతర కన్నడ బ్రాహ్మణుల మధ్యలో కూడా వివాహాలు తరచుగా జరుగుతాయి.[13]
దేశస్థ యజుర్వేది బ్రాహ్మణులు యజుర్వేదాన్ని అందులో చెప్పిన ఆచారాలానూ అనుసరిస్తారు.[14]
ఈ దేశస్థ ఋగ్వేది దేశస్థ యజుర్వేది బ్రాహ్మణులు మధ్వాచార్య ప్రతిపాదించిన ద్వైత వేదాంతాన్ని, ఆది శంకరాచార్య ప్రతిపాదించిన అద్వైత వేదాంతాలను అనుసరిస్తారు. దేశస్థ బ్రాహ్మణులలో మధ్వాచార్యను అనుసరించే వారిని దేశస్థ మధ్వ బ్రాహ్మణులు అని, ఆది శంకరాచార్యను అనుసరించే వారిని దేశస్థ స్మార్త బ్రాహ్మణులు అనీ అంటారు.[15][16]
The word Deshastha literally means residents of the country and the name is given to the Brahmans of that part of the Country
The Deshastha Brahman are sporadically distributed all through the state of Maharashtra starting from village to urban peripheries. Etymologically the term Deshastha signifies 'the residents of desh (highland) region'.
Desh usually refers to the Deccan plateau British districts and princely states in the upper Godavari, Bhima, and upper Krishna river basins, from Nasik in the north, south to Kolhapur. Deshastha, "being of the Desh", usually refers to a group of Brahmin castes differentiated by ritual affiliations with a Vedic shakha ("branch")
Earlier, both the subgroups, Yajurvedi and Rigvedi practised endogamy but now intermarriages between the two take place.
The Deshastha Ṛgvedi Brahmins as their name suggests, live in the Desh and follow a Ṛgvedic ritual. They are an extremely numerous and widespread community.
Deshastha Rigvedi Brahmins are the most ancient sub-caste of Maharashtra and they are to be found in all the districts of the Deccan, Marathi speaking part of the former Nizam State and in Berar. Marriage alliance between Deshastha Rigvedi and Telugu and Karnataka Brahmins takes place quite frequently.