దోర్జీ ఖండూ (19 మార్చి 1955 - 30 ఏప్రిల్ 2011) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అరుణాచల్ ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి. అతను 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలుపొంది రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
దోర్జీ ఖండూ భారతదేశంలోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలోని తవాంగ్‌లో జన్మించాడు. [1] దోర్జీ ఖండూకు నలుగురు భార్యలు, ఐదుగురు కుమారులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇతనిది బౌద్ధమతం.ఇతని పెద్ద కుమారుడు, . పెమా ఖండూ, ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
దోర్జీ ఖండూ ఇండియన్ ఆర్మీలో ఏడేళ్లపాటు పనిచేశారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో చేసిన సేవలకు గాను అతనికి బంగారు పతకం లభించింది.
మార్చి 1990లో, అతను థింగ్బు-ముక్తో నియోజకవర్గం నుండి అరుణాచల్ ప్రదేశ్ మొదటి శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. [2] మార్చి 1995లో, అతను అదే నియోజకవర్గం నుండి రెండవసారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెండవ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. [2] అతను 21 మార్చి 1995 నుండి సహకార శాఖ మంత్రి నియమించబడ్డాడు. [2]
9 ఏప్రిల్ 2007న, అతను గెగాంగ్ అపాంగ్ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో రాష్ట్రానికి ఆరవ ముఖ్యమంత్రి అయ్యాడు. [3] [4] మళ్లీ 2009లో, అతను అదే నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు 2019 అక్టోబరు 25న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు [3] [5]
2011 ఏప్రిల్ 30న, తవాంగ్ నుండి ఇటానగర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఖండూ మరో నలుగురు వ్యక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. [6] 2011 మే 4 న, ఉదయం 11 గంటల సమయంలో, కూలిపోయిన హెలికాప్టర్ అవశేషాలను స్థానికులు కనుగొన్నారు.
2011 మే 5 ఉదయం దోర్జీ ఖండూ మరణ వార్తను భారత హోం మంత్రి పి చిదంబరం ధృవీకరించారు. [7] అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ, దోర్జీ ఖండూ మరణం తనను తీవ్రంగా బాధిస్తుందని అన్నారు. [8]
ముఖ్యమంత్రి అంత్యక్రియలు తవాంగ్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన గ్యాంగ్ఖార్లో మోన్పా బౌద్ధ మత ఆచారాల ప్రకారం జరిగాయి. [9] ఇతని మంత్రి వర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జర్బోమ్ గామ్లిన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అదే సంవత్సరం అక్టోబరు 31న రాజీనామా చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రి ఇతనే.
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
అంతకు ముందువారు జిగాంగ్ అపాంగ్ |
అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి April 2007–2011 |
తరువాత వారు జార్బం గామ్లిన్ |