ద్విజేంద్ర నారాయణ్ ఝా | |
---|---|
![]() 2012 నవంబరులో ఝా | |
జననం | 1940 జూలై 1[1] గనౌలి, దర్భంగా జిల్లా, బ్రిటిషు భారతదేశం |
మరణం | (aged 80) |
విద్యాసంస్థ |
|
వృత్తి | చరిత్రకారుడు |
గుర్తించదగిన సేవలు | ది మిత్ ఆఫ్ ది హోలీ కౌ (2001) |
ద్విజేంద్ర నారాయణ్ ఝా ఒక వివాదాస్పద భారతీయ చరిత్రకారుడు.ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్,[2] ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్‌లో సభ్యుడు. వేదాల ఆధారంగా పూర్వం వైదిక బ్రాహ్మణులు ఆవు మాంసం తినే వారని, ఆవు మాంసం తినే ఆచారాన్ని భారతదేశంలో మొదట ప్రవేశ పెట్టినది ముస్లింలు కాదని వివరిస్తూ "మిత్ ఆఫ్ ది హోలీ కౌ" అనే పుస్తకం రాసాడు.[3] ఆ గ్రంథం రాసినందుకు అతనికి చావు బెదిరింపులు కూడా వచ్చాయి.[4] వేదాలు సంస్కృత-ప్రాకృత భాషలలో వ్రాసి ఉన్నాయి. వాటిలో కొన్ని భాగాలని మాత్రమే హిందీ, తెలుగు భాషలలోకి అనువదించడం జరిగింది.[మూలం అవసరం] అనువాదం కాని కొన్ని వేదాలని అనువదించి అందులోని విరుద్ధ అంశాలను బయట పెట్టినందుకు హిందూత్వవాదులు అతన్ని బెదిరించారు.[మూలం అవసరం] ద్విజేంద్ర నారాయణ్ ఝా కూడా బ్రాహ్మణుడే కానీ అతను బ్రాహ్మణుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యులుగా పనిచేసిన ద్విజేంద్ర నారాయణ్ ఝా బీహార్ రాష్ట్రం, దర్భంగా జిల్లాలో అమ్మగారి గ్రామం గనౌలిలో 1940 లో జన్మించాడు. తల్లి గౌరీదేవి, తండ్రి దేవస్వరూప్. ఝా కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో, పట్నా విశ్వవిద్యాలయంలో చదువుకొన్నాడు.
ఝా 2021 ఫిబ్రవరి 4 న, 81 ఏళ్ళ వయసులో ఢిల్లీలోని స్వగృహంలో చనిపోయాడు.
ద్విజేంద్ర నారాయణ్ ఝా సంస్కృత భాషని అర్థం చేసుకోకుండా వేదాలని అనువదించారని అతనిపై విమర్శలున్నాయి.[మూలం అవసరం]
నాగరికత తెలియని రోజుల్లో బ్రాహ్మణులు కూడా ఆవు మాంసం తిని ఉండొచ్చు. ఇప్పుడు కోడి, మేక మాంసాలు తినడం తప్పా కాదా అన్న ప్రశ్న మీద చర్చ జరుగుతోంది. నాగరికతలో వచ్చిన మార్పులు గురించి తెలుసుకోవడం తప్పు కాదని ప్రశంసకుల వాదన.[మూలం అవసరం]