ధడక్ | |
---|---|
దర్శకత్వం | శశాంక్ ఖైతాన్ |
రచన | శశాంక్ ఖైతాన్ |
దీనిపై ఆధారితం | సైరాత్ (మరాఠి సినిమా) [1][2] |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విష్ణు రావు |
కూర్పు | మోనిష ఆర్. బల్దావా |
సంగీతం | బ్యాక్ గ్రౌండ్ సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎదురి పాటలు: అజయ్-అతుల్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 20 జులై 2018 |
సినిమా నిడివి | 138 నిమిషాలు[3] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹41 కోట్లు[4] |
బాక్సాఫీసు | est. ₹110.11 కోట్లు[5] |
ధడక్ 2018లో విడుదలైన హిందీ సినిమా. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. జాహ్నవీ కపూర్, ఇషాన్ ఖట్టర్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 20 జులై 2018న విడుదలైంది.
జైపూర్లోనే హోటల్ నడుపుకునే వాడి కొడుకు మధుకర్ (ఇషాన్ ఖట్టర్) ఉదయ్ పూర్ లోని అగ్రవర్ణానికి చెందిన రతన్ సింగ్ (అశుతోష్ రాణా) కుమార్తె పార్ధవి (జాహ్నవి కపూర్) ను ప్రేమిస్తాడు. ఇది పార్థవి తండ్రికి తెలిసిపోయి ఇద్దర్నీ విడదీసి, మధుకర్ ని పోలీసుల చేత కొట్టిస్తాడు. పోలీసుల నుండి తప్పించుకుని ఇద్దరు ముంబై కు పారిపోతారు. ముంబై నుంచి నాగ్ పూర్ వెళ్ళిన మధుకర్, పార్హవి అక్కడ ఉండడం సురక్షితం కాదని భావించి కలకత్తా వెళ్లిపోతారు. అక్కడ ఇద్దరు చిన్న ఉద్యోగాలు చేస్తూ వుంటారు. చీటికీ మాటికీ ఇద్దరు గొడవలు పడుతూ, పార్థవి ఇంటికి వెళ్లి పోడానికి కూడా సిద్ధపడుతుంది. ఆ తర్వాత మనసు మార్చుకొని, ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్లకు బాబు పుడతాడు. కొన్నాళ్లకు పార్ధవి కుటుంబ సభ్యులు మళ్ళీ వారి జీవితాల్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత వారి జీవితం ఎటువంటి మలుపు తిరిగింది? అనేది మిగతా సినిమా కథ. [6]