ధనంజయ్ సింగ్ | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | పరస్నాథ్ యాదవ్ | ||
---|---|---|---|
తరువాత | కృష్ణ ప్రతాప్ సింగ్ | ||
నియోజకవర్గం | జౌన్‌పూర్ | ||
పదవీ కాలం 2002 – 2009 | |||
ముందు | శ్రీరామ్ యాదవ్ | ||
తరువాత | రాజదేయో సింగ్ | ||
నియోజకవర్గం | రారీ ఇప్పుడు మల్హాని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జౌన్‌పూర్ , ఉత్తరప్రదేశ్ | 1975 జూలై 16||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) (2017, 2022) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) (2007-2009)
బహుజన్ సమాజ్ పార్టీ (2009-2012) | ||
తల్లిదండ్రులు | రాజ్‌దేవ్‌సింగ్ | ||
జీవిత భాగస్వామి | మీను సింగ్ (2006-2007) జాగృతి సింగ్ (2009-17) శ్రీకళా రెడ్డి (2017- ప్రస్తుతం) | ||
పూర్వ విద్యార్థి | లక్నో విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
ధనంజయ్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మల్హాని నియోజకవర్గం నుంచి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒక్కసారి బీఎస్‌పీ నుండి జౌన్‌పూర్ ఎంపీగా పని చేశాడు.
ధనంజయ్ సింగ్ తన మొదటి భార్య మీనుని 12 డిసెంబర్ 2006న వివాహం చేసుకున్నాడు. ఆమె పది నెలల తర్వాత 12 సెప్టెంబర్ 2007న ఆత్మహత్య చేసుకొని మరణించింది.[1][2] ఆయన 29 జూన్ 2009న తన డా. జాగృతి సింగ్‌ని రెండో వివాహం చేసుకున్నాడు. వారు పరస్పర విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు.[3] ధనంజయ్ సింగ్ 2017లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీకళా రెడ్డిని పారిస్‌లో మూడవ వివాహం చేసుకున్నాడు. ఆమె తన భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2021లో జౌన్‌పుర్‌లోని 45వ వార్డు నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై జౌన్‌పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[4]
ధనంజయ్ సింగ్‌కునమామి గంగే ప్రాజెక్ట్ మేనేజర్ కిడ్నాప్ కేసులో, మే 2020లో నమోదైన కిడ్నాప్, దోపిడీ, నేరపూరిత కుట్ర కేసులో 50,000 జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష పడింది.[5]