ధమాకా | |
---|---|
![]() | |
దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
రచన | త్రినాధరావు నక్కిన ప్రసన్న కుమార్ బెజవాడ |
నిర్మాత | అభిషేక్ అగర్వాల్ టీజీ విశ్వ ప్రసాద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థలు | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ |
విడుదల తేదీs | 23 డిసెంబరు 2022(థియేటర్) 22 జనవరి 2023 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధమకా 2022లో తెలుగులో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలై, జనవరి 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]
స్వామి (రవితేజ) మిడిల్ క్లాస్‌కు చెందిన వ్యక్తి. ఉద్యోగం పోవడంతో నెల రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే చెల్లి (మౌనిక) పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చెల్లెలి స్నేహితురాలు పావనిని (శ్రీలీల) చూసి ఇష్టపడతాడు. పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ఏకైక కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ). తన కూతురు పావనిని ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలనీ పావని తండ్రి (రావు రమేష్) అనుకుంటాడు. ఇద్దరినీ చూసిన పావని ఎవరిని ఇష్టపడింది? పీపుల్స్ మార్ట్ కంపెనీని జేపీ(జయరామ్) స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. జేపీ ప్రయత్నాలను ఆనంద్ చక్రవర్తి అడ్డుకున్నాడా ? శ్రీలీల ఎవరిని ప్రేమిస్తుంది? అనేదే మిగతా కథ.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)