ధవళేశ్వరం | |
---|---|
నగర ప్రాంతం | |
Coordinates: 16°34′N 81°29′E / 16.57°N 81.48°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
నగరం | రాజమండ్రి |
జనాభా (2011) | |
• Total | 44,637 |
పిన్ కోడ్ | 533125 |
ఎస్.టి.డి. కోడ్ | 0883 |
ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి నగర ప్రాంతం.[1][2][3] ఇది గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగంగా కూడా ఉంది. [4] ఈ పట్టణం చివరిలో ఆర్ఠర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. ఇది కాటన్ గోదావరి నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే బొబ్బర్లంక, మద్దూర్లంక, విజ్జేశ్వరం అనకట్టలు వస్తాయి. ఈ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం 1982 సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
రాజమహేంద్రవరం రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున బొమ్మూరు గ్రామం, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన వేమగిరి గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, పిచ్చుకలంక, బొబ్బర్లంక గ్రామాల మీదుగా విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
ధవళేశ్వరం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ధవళేశ్వరం పట్టణంలో మొత్తం 11,631 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరధిలో మొత్తం జనాభా 44,637, అందులో 21,681 మంది పురుషులు కాగా, 22,956 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు లింగ నిష్పత్తి 1,059. పట్టణ పరిధిలో నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4527, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 2255 మంది మగ పిల్లలు, 2272 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 1,008, ఇది సగటు లింగ నిష్పత్తి (1,059) కంటే తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం రేటు 78.9%. తూర్పుగోదావరి జిల్లాలో 71%తో పోలిస్తే దౌలేశ్వరంలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 83.02%, స్త్రీల అక్షరాస్యత రేటు 75.1%.
గ్రామంలో అనేక ప్రభుత్వ, ప్రయివేటు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. బాలురకు, బాలికలకు విడివిడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.
ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా పదహారవ నంబరు జాతీయ రహదారి పోతున్నది. ఈ రహదారి విశాఖపట్నం, విజయవాడలను కలుపుతుంది. రాజమహేంద్రవరం నుండి కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం మొదలైన జిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రాష్ట్ర రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక, విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాను చేరుకోవచ్చు. సమీపంలో రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉంది.
ఈ గ్రామానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు.
ధవళేశ్వరం రాజమహేంద్రవరం పొలిమేర్లలో ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నది. గ్రామానికి దగ్గర్లోని రైలు స్టేషను రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉంది. గ్రామంలో ఒక బస్సు స్టాండు కూడా ఉంది. తొలి తెలుగు నవలగా పేరుగొన్న రాజశేఖర చరిత్రములో కథా స్థానంగా ధవళేశ్వరం వివరణ ఉంది. కందుకూరి వీరేశలింగం ఈ ఊరిలో నివసించాడు.
ధవళేశ్వరంలో ఒక పారిశ్రామిక వాడ ఉంది. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఈ వాడలో ఉన్నాయి.