![]() ధార్వాడ్ పెఠా | |
మూలము | |
---|---|
మూలస్థానం | భారత దేశము |
ప్రదేశం లేదా రాష్ట్రం | ధార్వాడ్, కర్ణాటక |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | డిజర్ట్ |
ప్రధానపదార్థాలు | పాలు, కండెన్స్డ్ మిల్క్, చక్కెర |
వైవిధ్యాలు | జంఖండీ పెఠా |
ఇతర సమాచారం | జి ఐ సంఖ్య : 85 |
ధార్వాడ్ పెఠా (కన్నడ: ಧಾರವಾಡ ಪೇಡ) భారతదేశం లోని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఏకైక ఒక తీపి రుచికరమైన పదార్థంగా ఉంది, కర్ణాటక లోని ధార్వాడ్ నగరం నుండి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ తీపి పదార్థం, చరిత్రలో దాదాపుగా 175 సంవత్సరాల నాటిది.[1]
ధార్వాడ్ పెఠాకు ଅ భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్) సంకేతం కల్పించబడింది.[2] దీని జి ఐ ట్యాగ్ సంఖ్య 85 అయి ఉంది.[3] కర్ణాటక ప్రజలు తీపి వంటకాల యందు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. ధార్వాడ్ పెఠా, మైసూర్ పాక్, చిరోటీ, ఒబ్బాట్టు (హొలిగే), ఫెని వంటి తీపి పదార్థాలు మంచి ఆదరణ కలిగినవిగా ఉన్నాయి.
ధార్వాడ్ పెఠా అసలు మొదట 19 వ శతాబ్దంలో ఉన్నావ్ లో ప్లేగు వ్యాధి ప్రబలిన కారణంగా, అక్కడ నుండి బయటపడిన తర్వాత, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లోని ఉన్నావ్ నుండి ధార్వాడ్ నకు వలస వచ్చిన ఠాకూర్ కుటుంబం వారు ప్రారంభించారు. రామ్ రతన్ సింగ్ ఠాకూర్, ద్వారా మొదటి తరం మిఠాయి తయారు చేసి, స్థానికంగా "పేడాలు"" అమ్మడం మొదలయింది.
ఠాకూర్ మనవడు బాబు సింగ్ ఠాకూర్ వారి కుటుంబం వ్యాపారం లైన్ బజార్ స్టోర్ లో పెరుగుటకు సహాయం అందించడం జరిగింది, "పేడా" కూడా స్థానికంగా "లైన్ బజార్ పెఠా"గా పిలిచారు. కుటుంబం అంతా ఒక వాణిజ్య రహస్యంగా ధార్వాడ్ పెఠాను తమ దగ్గర ఉంచుకుంటారు, దీనిలో వారి కుటుంబ వంశం కూడా ఉంది.
కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న బాబు సింగ్ ఠాకూర్ యొక్క ఒకే దుకాణం (స్టోర్) తదుపరి ధార్వాడ్, హుబ్లి, బెంగుళూర్, హవేలీ, పూణే లలో మరిన్ని అదనపు దుకాణాలు తరువాత వచ్చాయి. పూణే, ఇతర ప్రాంతాలలో ధార్వాడ్ పేడా అమ్మే ఇతర మిఠాయి దుకాణాలు వారు కూడా ఉన్నాయి. కానీ, ఇవి ఠాకూర్ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు.[1]
పాలు, చక్కెర, కండెన్స్డ్ (మిల్క్) పాలు పదార్థములు ఉన్నాయి.
దీనిని పాలు నిరంతరాయంగా వేడి చేస్తూ, చక్కెరతో కలపబడిన తరువాత, రుచి కోసం ఫ్లేవర్ (సుగంధ ద్రవ్యము) జోడించి తయారు చేస్తారు.
పట్టు దుస్తులు సేలం యొక్క ఏకైక బ్రాండ్. ఈ పట్టు కొరకు, అమ్మకాలు ఇంకా మంచి గుర్తింపు కోసం మార్గం సుగమం చేస్తూ, 1999 రూల్ 2003 చట్టం జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అధీకృత వినియోగదారు సర్టిఫికెట్ పొందింది.[4]