వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ధవల్ సునీల్ కులకర్ణి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | చునాభట్టి , ముంబై, మహారాష్ట్ర | 1988 డిసెంబరు 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 203) | 2014 సెప్టెంబరు 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 అక్టోబరు 26 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 91 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 65) | 2016 జూన్ 20 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 జూన్ 22 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 91 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2013 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–present | ముంబయి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 91) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | గుజరాత్ లయన్స్ (స్క్వాడ్ నం. 91) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2021 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2020 ఆగస్టు 31 |
ధవల్ సునీల్ కులకర్ణి, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ ఆటగాడు.[1] ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. కుడిచేతి మీడియం-పేస్ బౌలర్, కుడిచేతి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[2]
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్[3] కొరకు ఆడుతున్నాడు. దేశీయ సీజన్, ఐపిఎల్ లో తన స్థిరమైన ఆటతీరుతో, 2009లో న్యూజిలాండ్ లో జరిగిన సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.[4] కానీ అతను సిరీస్‌లోని మూడు టెస్టు మ్యాచ్‌లలో దేనిలోనూ ఆడేందుకు ఎంపిక కాలేదు.
ధవల్ సునీల్ కులకర్ణి 1988, డిసెంబరు 10న మహారాష్ట్ర, ముంబైలోని చునాభట్టి ప్రాంతంలో జన్మించాడు.
2012-13 రంజీ ట్రోఫీలో, ముంబైని 40వ సారి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా మార్చిన కీలక ఆటగాళ్ళ ధవన్ ఒకడు. 1వ ఇన్నింగ్స్‌లో 20* స్కోర్ చేసిన తర్వాత, సెమీ-ఫైనల్‌లో సర్వీసెస్‌పై 5/33 తీసుకున్నాడు. 4/24, 5/32తో 1వ సారి ఫైనలిస్టులైన సౌరాష్ట్రపై 148, 82 పరుగులకు అవుట్ చేశాడు. తద్వారా ఫైనల్‌లో ఇన్నింగ్స్ 125 పరుగుల తేడాతో విజయం సాధించాడు. దీంతో అతనికి ఇండియా ఎ క్రికెట్ జట్టులో అవకాశం లభించింది. 2014లో క్వాడ్రాంగులర్ సిరీస్‌కు ఎంపికయ్యాడు, అక్కడ అతను కప్ గెలవడంలో భారతదేశం కీలక పాత్ర పోషించాడు.
2016 ఐపిఎల్ సీజన్‌లో అతని ఆటతీరుకు క్రిక్ఇన్ఫో, క్రిక్ బజ్ ఐపిఎల్ XIలలో పేరు పొందాడు.[5][6]
2017-18 రంజీ ట్రోఫీలో ముంబయి తరపున ఆరు మ్యాచ్‌లలో 21 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[7]
2018 జనవరిలో 2018 ఐపిఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[8] 2018 జూలైలో 2018–19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ కోసం జట్టులో ఎంపికయ్యాడు.[9] 2018 అక్టోబరులో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం భారతదేశం ఎ జట్టులో ఎంపికయ్యాడు.[10] 2019 అక్టోబరులో 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు.[11]
2009లో న్యూజిలాండ్ పర్యటన కోసం టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు, కానీ అందులో అరంగేట్రం చేయలేదు. 2014లో క్వాడ్రాంగులర్ సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత అతను ఇంగ్లాండ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2014, సెప్టెంబరులో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ వన్డేలో తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[12] 2016, జూన్ 20న హరారేలో జింబాబ్వేపై తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.[13]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)