ధూప దామర చెట్టును ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ (Indian copal tree) అంటారు.ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:వెటెరియ ఇండిక .లిన్ణ్(veteria Indica Linn).ఈ చెట్టు డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందినమొక్క. భారతీయ భాషలలో ధూపదామర సాధారణ పేరు[1][2] =
పుష్పికరణ జనవరి నుండి మార్చి నెలలమధ్య జరుగును. పళ్లు మే నుండి జూలై లోపు పక్వానికి వచ్చును. పళ్ళు గుజ్జుకలిగి, గుండ్రంగా పొడవుగా సాగినట్లు వుండును. పళ్ల పరిమాణం 6x4 సెం.మీ.వుండును. రంగులో చూచుటకు సపోట పండును పోలివుండును. పండినప్పుడు పాలిఫొయిన బ్రౌన్‍రంగులో వుండును.ఒక చెట్టునుండి ఏడాదికి 400-500 కీజి.లవరకు పళ్ళువుత్పత్తి అగును.పండులో గింజశాతం 47% వుండును.గింజలో నూనె/కొవ్వు 19-23% వరకుండును. పచ్చిగావున్న గింజల్లో తేమశాతం ఎక్కువ వుండును. గింజలను ఆరబెట్టిన (Dried) తరువాత తేమ 5-7%కు తగ్గును.కర్నాటకలో 5వేల టన్నులు, కేరళలో 7 వేల3 వందల టన్నుల విత్తనాన్ని సేకరించవచ్చును.
సేకరించిన నూనె గింజలను మొదట కళ్లంలో బాగా ఆరబెట్టి అధికంగా వున్న తేమను తొలగించెదరు.గింజలనుండి నూనెను సంప్రదాయ పద్ధతిలో లేదా నూనెతీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ పద్ధతిలో గింజలను మొదట మొత్తగా నలగకొట్టి, నీటిలోకలిపి వేడిచేసిన, వేడినీటి పైభాగంలో నూనెతెట్టుగా ఏర్పడును. ఈవిధానంలో తక్కువశాతంలో వచ్చును. అంతగా ఆచరణయోగ్యం కాదు. నూనెగింజల నుండి ఎక్సుపెల్లరు యంత్రంద్వారా 7-9% నూనెను పొందవచ్చును.కేకులో మిగిలివున్న 10-12% నూనె/కొవ్వును సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంటులో ఆడించి పొందెదరు. ధూపనూనెను పినెటాలో (piney Tallow), మలబారు టాలో, ధూప ఫ్యాట్ (fat) అని కూడా పిలుస్తారు.
ధూప నూనె/కొవ్వు నీలిఛాయతో కూడిన పసుపు రంగులో వుండును. మంచివాసన కల్గి వుండును. గది ఉష్ణోగ్రత వద్ద ఇది ఘనస్ధితిలో వుండును.ఇందుకు కారణం దీని అయోడిన్ విలువ తక్కువగా వుండటం వలననే.గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్ధితిలోవుండు నూనెలను కొవ్వులు (Fats) అంటారు.
నూనె/కొవ్వులోని కొవ్వు ఆమ్లంలశాతం[1][3]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం | 9.7-13.0 |
స్టియరిక్ ఆమ్లం | 38.0-45.0 |
మిరిస్టిక్ ఆమ్లం | 0.0-1.0 |
అరచిడిక్ ఆమ్లం | 0.4-4.6 |
ఒలిక్ ఆమ్లం | 42.0-48.0 |
లినొలిక్ ఆమ్లం | 0.2-2.3 |
లినొలెనిక్ ఆమ్లం | 0.5 వరకు |
పామిటిక్, స్టియరిక్, మిరిస్టిక్, అరచిడిక్ ఆమ్లాలు సంతృప్త కొవ్వు ఆమ్లాలు. ఒలిక్ ఆమ్లం ఏకద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.లినోలెక్ ఆమ్లం రెండుద్విబంధాలు, లినొలెనెక్ ఆమ్లం మూడు ద్విబంధాలను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలు.
ధూప నూనె/కొవ్వు భౌతిక లక్షణాలపట్టిక[1][4]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 600Cవద్ద | 1.4577-1.4677 |
ఐయోడిన్ విలువ | 36-51 |
సపనిఫికెసను విలువ | 186-193 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 1.0-2.0 గరిష్ఠం |
టైటరు | 530C కనిష్ఠము |