ధ్వని గౌతమ్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | ది ఏషియన్ స్కూల్ మార్వా స్టూడియోస్ నోయిడా |
వృత్తి | దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
ధ్వని గౌతమ్ ఫిల్మ్స్ |
ధ్వని గౌతమ్, గుజరాత్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత.[1][2][3] గుజరాత్, బాలీవుడ్ సినిమారంగాలలో పనిచేస్తున్నాడు.
ధ్వని గౌతమ్ 1985, జూలై 22న గుజరాత్‌లో జన్మించాడు. ది ఏషియన్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను, మార్వా స్టూడియోస్ నోయిడా నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీని పూర్తిచేసాడు.
తన 13 సంవత్సరాల వయస్సుతో యష్ చోప్రా తీసిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చూసినప్పుడు సినిమా దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినందున సినిమారంగంలో తన కెరీర్‌ను కొనసాగించడానికి ముందు న్యూఢిల్లీలోకొంతకాలం రేడియో జాకీగా పనిచేశాడు. సినిమారంగం కోసం ముంబైకి మారాడు.
బా బహూ ఔర్ బేబీ అనే నాటకానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఆ తర్వాత మరో మూడు సీరియల్స్‌కి పనిచేశాడు. సన్నీ డియోల్ నటించిన హీరోస్, బాబీ డియోల్ నటించిన నన్హే జైసల్మేర్ సినిమాలకు పనిచేశాడు. దర్శకత్వం, రచనలో అనుభవం సంపాదించిన తరువాత, పంజాబీ సినిమారంగానికి పనిచేసాడు.
2015లో తన స్వంత సినిమా రొమాన్స్ కాంప్లికేటెడ్‌పై పనిచేయడం ప్రారంభించాడు, ఇది అతని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా.[4] విదేశాలలో చిత్రీకరించబడిన తొలి గుజరాతీ సినిమా.[5] ఆ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌లో కూడా నటించాడు.[6]
2018లో గ్రేట్ గుజరాతీ కుకింగ్ పోటీ పేరుతో కుకింగ్ షోతో టెలివిజన్‌లోకి మళ్ళీ వచ్చాడు.[7]
సంవత్సరం | సినిమా |
---|---|
2007 | హ్యాట్సాఫ్ ప్రొడక్షన్స్ |
2008 | సాగర్ ఆర్ట్స్ వడోదర |
2008 | హీరోస్ |
సంవత్సరం | సినిమా | దర్శకుడు | నటుడు | అసోసియేట్ ప్రొడ్యూసర్ | స్క్రీన్ ప్లే రచయిత |
---|---|---|---|---|---|
2014 | ది లాస్ట్ డాన్ | Yes | |||
2016 | రొమాన్స్ కాంప్లికేటెడ్ | Yes | Yes | Yes | Yes |
2016 | టు టో గయో | Yes | Yes | Yes | Yes |
2018 | మిడ్ నైట్ విత్ మెంకా | Yes | |||
2019 | ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్[8] | Yes | Yes | Yes | Yes |
2020 | గోల్కేరి | Yes | |||
2022 | హూన్ తారీ హీర్[9] | Yes | Yes | Yes | Yes |
2023 | డేరో[10] | Yes | Yes | Yes | Yes |
2023 | శుభ్ సాంజ్[11] | Yes | Yes | Yes | Yes |
2023 | ది స్టోరీ ఆఫ్ పటేల్ వర్సెస్ పాట్రిక్ | Yes | Yes | Yes | Yes |
2023 | కేసరియా | Yes | Yes | Yes | Yes |
2023 | లవ్ అత్రాంగి | Yes | Yes | Yes | Yes |
సంవత్సరం | సిరీస్ | సీజన్ | దర్శకుడు | నిర్మాత | నెట్‌వర్క్/ప్లాట్‌ఫారమ్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
2013 | జీవిత వార్త | 1 | Yes | Yes | విటివి-గుజరాతి | సీరియల్ |
2017 | మిస్టర్ డి షో[12] | 1 | Yes | Yes | జిటిపిఎల్ | చాట్ షో & హోస్ట్ |
2018 | గ్రేట్ గుజరాత్ కుకింగ్[13] | 1 | జిటిపిఎల్ | కుకింగ్ షో & హోస్ట్ | ||
2019 | మిస్టర్ డి షో - గెట్ ఫన్నీ విత్ ధ్వని[14] | 2 | Yes | Yes | షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ | చాట్ షో & హోస్ట్ |
2019 | గ్రేట్ గుజరాత్ కుకింగ్[15] | 2 | న్యూస్18 గుజరాతీ | కుకింగ్ షో & హోస్ట్ |
సంవత్సరం | పాట | దర్శకుడు | నిర్మాత | స్క్రీన్ ప్లే రచయిత |
---|---|---|---|---|
2021 | వాల్మియా 2.0 | Yes | Yes | Yes |
2021 | పరదేశీయ | Yes | Yes | Yes |
2021 | హవా కర్దా | Yes |