నగ్నసత్యం (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యు.విశ్వేశ్వర రావు |
---|---|
తారాగణం | రాంప్రసాద్, మహేశ్వరి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | దీప్తి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
నగ్నసత్యం 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంప్రసాద్, మహేశ్వరి నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.
పుష్ప బాగా చదువుకున్న యువతి. పరిస్థితుల ప్రభావం వల్ల జోగారావు చేతిలో పడుతుంది. జోగారావు ఆమెతో వ్యాపారం చేస్తుంటాడు. విషవలయంలో నుండి బయట పడటానికి, నూతన జీవితం ప్రారంభించడానికి రిక్షా రాములు, గోవిందం బాబు సహాయంతో ఏర్పాట్లు చేస్తాడు. పుష్ప కొత్త జీవితం ప్రారంభించడం ఇష్టం లేని పోలీసు ఎస్.ఐ, కానిస్టేబుళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయి దొంగకేసు బనాయించి ఒకరి తరువాత ఒకరు ఆమెను రాక్షసుల్లా చెరుస్తారు. ఇది అన్యాయం అన్నందుకు రాములును చితకబాదుతారు. రాములు మరణిస్తాడు. గోవిందం బాబు రాములు శవాన్ని పోలీసు స్టేషనుకు తీసుకువెడతాడు[1].
1.ఈదేశంలో ఈకాలంలో ఈ మండుటెండలో , గానం.జి.ఆనంద్
2.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలసి, గానం.జి.ఆనంద్
3.బంగారు వన్నె కోసం గీటురాయి ఉందిరా, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్
4.మీకు మీరే పెద్దలు మీకు మీరే హద్దులు , గానం.శిష్ట్లా జానకి,బృందం,రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.
. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.