వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | సయ్యద్ నజాఫ్ హుస్సేన్ షా |
పుట్టిన తేదీ | గుజార్ ఖాన్, పాకిస్తాన్ | 1984 డిసెంబరు 17
ఎత్తు | 6 అ. 4 అం. (193 cమీ.) |
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ |
పాత్ర | బౌలింగ్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్డే | 2007 మే 22 - శ్రీలంక తో |
మూలం: CricInfo, 2022 ఆగస్టు 15 |
సయ్యద్ నజాఫ్ హుస్సేన్ షా (జననం 1984, డిసెంబరు 17) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 2007లో యుఏఈలోని అబుదాబిలో శ్రీలంకతో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.[1][2] [3] లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేయగలిగిన ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 134 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు,[4] 477 వికెట్లు తీశాడు,[5] 2004-05లో ప్యాట్రన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తరపున 57 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ప్రస్తుతం డల్లాస్ టెక్సాస్ యుఏఈలో నివసిస్తున్నారు.[6]
ఇతడు గుజార్ ఖాన్‌కు చెందినవాడు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో సర్వర్ షహీద్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత కళాశాల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీలో కళాశాల జట్టు కొన్ని ప్రధాన టోర్నమెంట్లను గెలుచుకుంది. 2000-01లో ఉన్నత విద్య కోసం గుజార్ ఖాన్ నుంచి రావల్పిండికి వెళ్ళాడు. రావల్పిండికి వెళ్ళిలిన తర్వాత గుల్ క్రికెట్ క్లబ్లో చేరాడు.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)