నటరాజన్ చంద్రశేఖరన్ | |
---|---|
![]() నటరాజన్ చంద్రశేఖరన్, 2013 | |
జననం | నటరాజన్ చంద్రశేఖరన్ 1963 జూన్ 2 |
విద్య | కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఎన్.ఐ.టి తిరుచిరప్పల్లి |
వృత్తి | చైర్మన్, టాటా గ్రూప్ |
ఉద్యోగం | టాటా గ్రూప్ |
బోర్డు సభ్యులు | టాటా సన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్, లక్నో |
జీవిత భాగస్వామి | లలిత చంద్రశేఖరన్ |
పిల్లలు | ప్రణవ్ చంద్రశేఖరన్[1] |
నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన టాటాసన్స్ చైర్మన్‌గా 2017 జనవరి 12న నియమితుడయ్యాడు.[2] నటరాజన్ చంద్రశేఖరన్‌కు 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[3] టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ ఐదేళ్ల తన పదవీకాలాన్ని సమర్థంగా నిర్వహించారు. ఆ కారణంగా మరో ఐదేళ్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ కంపెనీ బోర్డు 2022 ఫిబ్రవరి 11న నిర్ణయం తీసుకుంది.[4] ప్రస్తుతం టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్ ఇకపై ఎయిరిండియా విమానయాన సంస్థకూ ఛైర్మన్‌గా వ్యవహరిప్తారు. ఈ మేరకు ఎయిరిండియా బోర్డు ఆయన నియామకానికి 2022 మార్చి 14న ఆమోదం తెలిపింది.[5]
నటరాజన్ చంద్రశేఖరన్ మోహనూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి 1986లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల నుండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశాడు. ఆయన 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో చేరి ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేసి 2009 అక్టోబరు 6న టాటా సి.ఈ.ఓగా బాధ్యతలు చేపట్టాడు. చంద్రశేఖరన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ లో సీనియర్ సభ్యుడు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ కంప్యూటర్ సొసైటీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు.ఆయన 2015 ఏప్రిల్లో భారతీయ ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యాడు.