నదియా | |
---|---|
జననం | జరీనా 1966 అక్టోబరు 24 |
ఇతర పేర్లు | నదియా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1984–1989; 1994 2004–ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | శిరీష్ గోడ్‌బొలె (m.1988–ఇప్పటి వరకు) |
పిల్లలు | సనమ్(b.1996) జన(b.2001) |
తల్లిదండ్రులు | ఎన్. కె. మొయిదు, లలిత |
పురస్కారాలు | ఫిలింఫేర్ ఉత్తమ నటి ఫిలింఫేర్ ఉత్తమ విమర్శకుల నటి |
నదియా ప్రముఖ సినీ నటి. ఆమె అసలు పేరు జరీనా. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తిచేసింది.
ఆమె మొదటిసారిగా 1984 లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించింది. 1988 లో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్‌బొలెను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లింది. తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్‌డమ్లో నివాసమున్నారు.[4].
మళ్ళీ 2004లో ఓ తమిళ సినిమాతో పునఃప్రవేశించింది. 2013 లో తెలుగు సినిమా మిర్చి లో ప్రభాస్ అమ్మగా, పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో కథానాయకుడికి అత్తగా నటించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.