నమ్రతా రావు | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
నమ్రతా రావు కేరళకు చెందిన సినిమా ఎడిటర్. ఓయ్ లక్కీ, లక్కీ ఓయ్! (2008), ఇష్కియా (2010), బ్యాండ్ బాజా బారాత్ (2010), లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011), కహానీ (2012) వంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసింది.[1]
2010లో వచ్చిన లవ్ సెక్స్ ఔర్ ధోఖా సినిమా ఎడిటర్ గా, నటిగా అత్యంత ప్రసిద్ధి చెందింది. 2011లో ఈ సినిమాకు ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన కహానీ (2012)కి ఉత్తమ ఎడిటింగ్‌కి జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ ఎడిటింగ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
నమ్రతా రావు 1981, జూన్ 17న ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఐటీలో పట్టా పొందిన నమ్రతా, సినిమారంగంలోకి వచ్చింది.[2][3]
గ్రాఫిక్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అమృతా రావు, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్ మేకింగ్ అధ్యయనం చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు కొంతకాలం ఎన్డీటీవీలో కూడా పనిచేసింది.[2][4]
సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా |
---|---|---|---|
2012 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | కహానీ[5] |
2011 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | లవ్ సెక్స్ ఔర్ ధోఖా[6] |
2013 | కహానీ | ||
2011 | ఐఫా అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | బ్యాండ్ బాజా బారాత్[7] |
2013 | కహానీ | ||
2011 | కలర్స్ స్క్రీన్ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | బ్యాండ్ బాజా బారాత్ |
2013 | కహానీ | ||
2013 | జీ సినీ అవార్డులు | ఉత్తమ ఎడిటర్ | |
2013 | టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ ఎడిటర్ |