వ్యక్తిగత సమాచారం | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
జననం | పెరంబ్రా కోజికోడ్, కేరళ, భారతదేశం[1] | 1995 అక్టోబరు 18
విద్య | మార్ ఇవానియోస్ కళాశాల - కేరళ విశ్వవిద్యాలయం |
ఎత్తు | 1.74 మీ. (5 అ. 9 అం.) |
బరువు | 62 కి.గ్రా. (137 పౌ.) |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | ట్రాక్ అండ్ ఫీల్డ్ |
పోటీ(లు) | లాంగ్ జంప్ |
సాధించినవి, పతకాలు | |
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | 6.55 (పాటియాలా 2017) |
నయన జేమ్స్ (జననం 1995 అక్టోబరు 18) లాంగ్ జంప్ ఈవెంట్లో పోటీపడుతున్న ఒక భారతీయ క్రీడాకారిణి.[2][3][4]
ఆమె 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ – మహిళల లాంగ్ జంప్‌లో కాంస్య పతకాన్ని, ఆమెతో పాటు మరో భారతీయ క్రీడాకారిణి నీనా వరాకిల్ రజతం సాధించింది.[5]
నయన జేమ్స్ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో 1995 అక్టోబరు 18న జన్మించింది.[6] ఆమె కోజికోడ్‌లోని సెయింట్ జార్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు మాజీ అథ్లెట్ అయిన కె.ఎమ్ పీటర్ ఆమెకు క్రీడలపట్ల ఉన్న మక్కువ కనుగొన్నాడు. 2010లో, ప్రఖ్యాత క్రీడాకారిణి మయూఖా జానీ మాజీ కోచ్ అయిన జోస్ మాథ్యూ వద్ద శిక్షణ పొందేందుకు ఆమె కేరళలోని తలస్సేరిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరింది.[2]
2017లో పాటియాలాలో జరిగిన 21వ ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఆమె ప్రసిద్ది చెందింది. ఆమె లాంగ్ జంప్ ఈవెంట్లో 6.55 మీటర్ల జంప్‌ను నమోదు చేసింది, ఇది ఆమె వ్యక్తిగత అత్యుత్తమం.[3] పాటియాలాలో 22వ ఫెడరేషన్ కప్‌లో లాంగ్ జంప్ ఈవెంట్లో ఆమె మరో స్వర్ణం సాధించి తన పరంపరను కొనసాగించింది.
లాంగ్ జంప్ ఈవెంట్ చరిత్రలో ఆమె 6.55 మీటర్ల జంప్ చేసి టాప్ 5 భారతీయ క్రీడారులలో ఒకరిగా నిలిచింది. 2018లో, ఆమె కామన్వెల్త్ గేమ్స్ మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో 12వ స్థానంలో నిలిచింది. 2018 ఆసియా ఇండోర్ గేమ్స్‌లో, మహిళల లాంగ్ జంప్‌లో ఆమె 6.08 మీటర్ల ఎత్తుతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.