నరసింహ (1999 తెలుగు సినిమా) | |
నరసింహ DVD ముఖచిత్రం | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
రచన | కె. ఎస్. రవికుమార్ |
తారాగణం | రజనీకాంత్, శివాజీ గణేశన్, రమ్య కృష్ణ, సౌందర్య, లక్ష్మి, నాజర్, ప్రీత విజయకుమార్, అబ్బాస్ |
సంగీతం | ఎ.ఆర్. రెహమాన్ |
భాష | తెలుగు |
నరసింహ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఒక డబ్బింగ్ సినిమా. ఇది 1999 లో విడుదలైంది. ఇది తమిళ సినిమా పడయప్పా కు అనువాదం.
నరసింహ (రజనీకాంత్) ఒక జమీందారు (శివాజీ గణేశన్) కొడుకు. పట్నంలో చదువుకుని ఊరికి వస్తాడు. తన మేనమామ కూతురైన నీలాంబరి (రమ్యకృష్ణ) గర్విష్టి. ఆమె నరసింహను పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కానీ నరసింహకు మాత్రం ఆమె ప్రవర్తన నచ్చదు. నీలాంబరి ఇంట్లో పనిచేసే వసుంధర (సౌందర్య) ను ఆరాధిస్తుంటాడు. అక్రమ సారా కేసులో నరసింహ తన తమ్ముళ్ళనే అరెస్టు చేయిస్తాడు. దాంతో అతని చిన్నాన్నలు ఆస్తిని పంచమని గొడవ చేస్తారు. ఆస్తి పంచడం ఇష్టం లేక జమీందారు తన ఆస్తినంతా తమ్ముళ్ళకే ఇచ్చేసి తన కొడుకు సంపాదనతో కొన్న ఊరి బయటి స్థలంలోకి మారాలనుకుంటాడు. కానీ ఆ వియోగం తట్టుకోలేక ఆ ఇంట్లోనే మరణిస్తాడు.