నరాంతక-దేవాంతక | |
---|---|
తోబుట్టువులు | అతికాయుడు త్రిశిర |
తండ్రి | రావణుడు |
తల్లి | ధాన్యమాలిని |
నరాంతక-దేవాంతక అనేవి రామాయణ ఇతిహాసంలో ఒక పాత్రలు. అసురులు, లంక రాజు రావణుని కుమారులు.[1]
రావణుడు అతని రెండవ భార్య ధాన్యమాలినికి జన్మించారు. ధ్యానమాలిని గురించిన ఖచ్చితమైన వివరాలు లేవు. కానీ కొన్ని కథలలో ధ్యానమాలిని మాయాసురుని కుమార్తెగా, మండోదరి సోదరిగా ప్రస్తావించబడింది.
గణేశ పురాణంలో వీరు రుద్రకేతువు ఋషి కుమారులు. శివుడిని ప్రార్థించిన తరువాత, వారికి వరాలు లభించడంతో శక్తివంతమైన, క్రూరమైన పాలకులుగా మారారు. స్వర్గలోకంపై సార్వభౌమాధికారాన్ని స్వీకరిస్తారు. దాంతో గణేశుడు అవతారమెత్తి తన అష్టసిద్ధి సహాయంతో రాక్షస సైన్యంతో యుద్ధంచేసి, చివరికి తన దంతాలలో దేవాంతకుడిని చంపేస్తాడు. తరువాత రావణుడి కుమారులుగా జన్మించారు.
రామాయణ యుద్ధంలో, నరాంతకుడిని బలి కుమారుడైన అంగదుడు చంపగా, దేవాంతకుడిని ద్వంద్వ యుద్ధంలో హనుమంతుడు తన చేతితో చంపాడు.[2]
[[వర్గం:పురాణ పాత్రలు]]